Begin typing your search above and press return to search.

అదిరేటి చీరలో క్యూట్ నిహారిక... వ్వాటే లుక్

తాజాగా బ్లూ కలర్ చీరలో పోజులిచ్చింది నిహారిక. శారీకి తగ్గట్టు డిజైనర్ బ్లౌజ్ ధరించింది. జడ ముందుకు వేసి కొంటెగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   7 March 2024 2:22 PM GMT
అదిరేటి చీరలో క్యూట్ నిహారిక... వ్వాటే లుక్
X

ప్రముఖ మెగా కాంపౌండ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అక్కడి నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక మాత్రమే. ఇటీవల తన భర్తతో డివోర్స్ తీసుకున్న నిహారిక.. కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తోంది. సినీ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా బిజీగా మారుతోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకెళ్తోంది.

మరోవైపు సోషల్ మీడియా లో యమా యాక్టివ్ గా ఉంటోంది నిహారిక కొణిదెల. రోజూ పిక్స్ తోపాటు అప్డేట్స్ ఇస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటుంది. ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. పొట్టి డ్రెస్సులతో పాటు చీరల్లో అందాలు ఆరబోస్తుంటోంది. క్రమంగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. నవ్వుతూ కుర్రకారు మతులు పోగుడుతుంటోంది.

తాజాగా బ్లూ కలర్ చీరలో పోజులిచ్చింది నిహారిక. శారీకి తగ్గట్టు డిజైనర్ బ్లౌజ్ ధరించింది. జడ ముందుకు వేసి కొంటెగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్ ను సెట్ చేసుకుంది మెగా డాటర్. చిన్న బొట్టు పెట్టుకుని మినిమల్ మేకప్ లుక్ లో అందంగా నవ్వుతూ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం నిహారిక కొత్త పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మెగా డాటర్ సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నిహారిక నయా ఫొటోలపై ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. నవ్వుతోనే మాయ చేస్తున్నావ్ గా అమ్మడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నిహారిక కోలీవుడ్ లో మద్రాస్ కారన్ మూవీ చేస్తోంది. ఆర్ డీ ఎక్స్ నటుడు షేన్ నిగమ్‌ సరసన నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇంతకముందు కూడా నిహారిక... తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసింది.

ఇక తెలుగులో మంచు మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ మూవీలో యాక్ట్ చేస్తోంది నిహారిక. కొద్దిరోజుల క్రితం మెగా డాటర్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రముఖ ఓటీటీ ఆహాలో లాంఛ్ కాబోతున్న చెఫ్ మంత్ర సీజన్-3కు హోస్ట్ గా వ్యవహరించనుంది. మొత్తానికి వచ్చిన అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది నిహారిక.