Begin typing your search above and press return to search.

పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా ఎందుకు చేయలేదంటే: నిహారిక

అయితే నిర్మాతగా, హోస్ట్ గా, నటిగా మెప్పించిన నిహారిక.. ఇప్పటి వరకు హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేదు. బడా కమర్షియల్ మూవీలో నటించలేదు.

By:  Tupaki Desk   |   11 March 2024 12:33 PM GMT
పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా ఎందుకు చేయలేదంటే: నిహారిక
X

మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారింది. టాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి . తమిళంలో మద్రాస్ కరన్ మూవీ చేస్తున్న అమ్మడు తెలుగులో వాట్ ది ఫిష్ లో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టుల మేకర్స్ ఆమెతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హోస్ట్ గా సందడి చేయనుంది నిహారిక.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న చెఫ్ మంత్ర సీజన్-3కి హోస్ట్ గా అలరించనుంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ షూట్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఇది వరకే ఢీతోపాటు పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన నిహారిక.. మరోసారి తన యాంకరింగ్ తో ఆకట్టుకోనుంది. తాజాగా మెగా డాటర్.. ఓ మీడియాతో తన కెరీర్ తో ఇతర విషయాలపై ముచ్చటించింది. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

అయితే నిర్మాతగా, హోస్ట్ గా, నటిగా మెప్పించిన నిహారిక.. ఇప్పటి వరకు హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేదు. బడా కమర్షియల్ మూవీలో నటించలేదు. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించింది నిహారిక. " నాకు వచ్చిన ఆఫర్స్ లో మంచివి సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పటివరకు అలాంటి ఆఫర్స్ వచ్చాయి కాబట్టి హ్యాపీగా చేశాను. అయితే నాకు ఏ దర్శకుడి నుంచి కూడా ఇప్పటి వరకు కమర్షియల్‌ సినిమా ఆఫర్‌ రాలేదు. వారు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. కాదు అని ఆడిషన్ కు పిలిచినా వెళ్తాను" అని క్లారిటీ ఇచ్చింది మెగా డాటర్.

మరోవైపు, నిహారిక తండ్రి, నటుడు నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- టీడీపీ కూటమి తరపున పోటీ చేయనున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికపై నిహారిక స్పందించింది. తాను ఈ సారి కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని చెప్పింది. ఇప్పటికే తన ఓటు ఆంధ్రాలో ఉందని చెప్పింది నిహారిక.

ఓటీటీ ప్లాన్స్ గురించి ప్రశ్నించగా.. తాను ఇప్పటికే డిస్నీ + హాట్ స్టార్, జీ 5 ఓటీటీల్లో పలు షోలు చేసినట్లు తెలిపింది నిహారిక. సోనీ లివ్ లో మరో షో చేస్తున్నట్లు చెప్పింది. ఆహాలో చెఫ్ మంత్ర సీజన్-3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది. ఇంకా కొన్ని కొత్త వెంచర్స్ తో రాబోతున్నట్లు తెలిపింది. విడాకుల తర్వాత దూసుకెళ్తున్న నిహారిక.. కెరీర్ లో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.