Begin typing your search above and press return to search.

దారి మార్చిన మెగా డాటర్‌..!

తెలుగు లో కాకుండా తమిళంలో మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌ గా చేసేందుకు రెడీ అయ్యింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:42 AM GMT
దారి మార్చిన మెగా డాటర్‌..!
X

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే హీరోయిన్‌ గా నాగ బాబు కూతురు నిహారిక మాత్రమే పరిచయం అయిన విషయం తెల్సిందే. చాలా కాలం క్రితమే నిహారిక హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది. కానీ అప్పుడు కమర్షియల్‌ గా విజయాలను సొంతం చేసుకోలేక పోయింది.

హీరోయిన్ గా విజయాలు దక్కక పోవడంతో పాటు, పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టడం వల్ల నిహారిక సినిమాలకు దూరం అయ్యింది. కొన్ని వ్యక్తిగత కారణాలతో భర్త నుంచి విడి పోయిన నిహారిక తెలుగు లో వెబ్‌ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించేందుకు కథలు వింటున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

తెలుగు లో కాకుండా తమిళంలో మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌ గా చేసేందుకు రెడీ అయ్యింది. తెలుగు లో పలు కథలు విన్నా కూడా తనకు తగ్గవి లభించక పోవడంతో తమిళ ప్రాజెక్ట్‌ మద్రాస్ కారన్‌ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమాలతో షురూ అయ్యింది.

ఆర్‌ డి ఎక్స్ నటుడు షేన్‌ నిగమ్‌ హీరోగా కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న మద్రాస్ కారన్‌ సినిమాకు పొన్రం వీవీఎస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సామ్‌ సి ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నిహారిక కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్ర చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రూటు మార్చి కోలీవుడ్ వైపు వెళ్తున్న నిహారిక కి హిట్ దక్కేనా చూడాలి.