Begin typing your search above and press return to search.

మెగా డాటర్ కొత్త రూటు.. సో డిలీషియస్ గురూ!

మెగా డాటర్ నిహారిక.. తన కెరీర్ పై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 11:48 AM GMT
మెగా డాటర్ కొత్త రూటు.. సో డిలీషియస్ గురూ!
X

మెగా డాటర్ నిహారిక.. తన కెరీర్ పై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. విడాకుల తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు వచ్చిన అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. టాలీవుడ్ లో మంచు మనోజ్ మూవీ వాట్ ది ఫిష్ చేస్తున్న ఈ బ్యూటీ.. కోలీవుడ్ లో మరో సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేసిన నిహారిక.. ఇటీవల మద్రాస్ కారన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. ఈ మూవీలో మలయాళం హీరో ఆర్డీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఓ ఫేమస్ షోకు హోస్ట్ గా వ్యవహరించనుంది.

తెలుగులో ఎన్నో షోలతో అలరిస్తున్న ప్రముఖ ఓటీటీ ఆహాలో లాంఛ్ కాబోతున్న ఓ చాట్ షోతో నిహారిక ఓటీటీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. త్వరలోనే చెఫ్ మంత్ర సీజన్-3ను లాంఛ్ చేయనుంది ఆహా. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 3వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ తో పాటు సెలబ్రిటీల ఫన్నీ చిట్ చాట్ లు అందించనుంది. ఈ మూడో సీజన్ ను నిహారిక హోస్ట్ చేయనుంది.

ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటిస్తూ నిహారిక ఫన్నీ పోస్టర్ షేర్ చేసింది. అయితే ఈ షో ఎపిసోడ్స్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ కానున్నాయి. చెఫ్ మంత్ర సీజన్ 3 కోసం ఇండస్ట్రీలోని క్రేజీ స్టార్లను తీసుకురాబోతోన్నారట. మొత్తం 8 ఎపిసోడ్లను ప్లాన్ చేశారట. నిహారిక గెస్టులతో పెట్టే ముచ్చట్లు, నవ్వులు, వంటలతో షోను ఫన్ రోలర్ కోస్టర్ రైడ్‌ లా ప్లాన్ చేస్తోందట ఆహా.

ఇప్పటికే చెఫ్ మంత్ర తొలి రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. మొదటి సీజన్‌ ను యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసింది. ఇక రెండో సీజన్‌ కు మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరించింది. అయితే మంచు లక్ష్మి మాటలకు అంతా అట్రాక్ట్ అయ్యారు. ఇది వరకే పలు షోస్ కు హోస్ట్ గా చేసి నిహారిక కూడా సక్సెస్ అయ్యింది. మరి మెగా డాటర్ ఈ షో ద్వారా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.