Begin typing your search above and press return to search.

మెగా అమ్మాయి.. పొట్టి డ్రెస్ లో ఇలా..

మెగా వారసురాలు నిహారిక కొణిదెల.. మ‌ళ్లీ సినీ ఇండ‌స్ట్రీలో బిజీగా మారిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకెళ్తోంది

By:  Tupaki Desk   |   22 Feb 2024 1:28 PM GMT
మెగా అమ్మాయి.. పొట్టి డ్రెస్ లో ఇలా..
X

మెగా వారసురాలు నిహారిక కొణిదెల.. మ‌ళ్లీ సినీ ఇండ‌స్ట్రీలో బిజీగా మారిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకెళ్తోంది. ఓ వైపు నటిస్తూనే.. మరోవైపు నిర్మిస్తోంది. అయితే నిహారికకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. పెళ్లి అయిన తర్వాత.. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్న మెగా డాటర్.. ఇప్పుడు కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్‌ గా చేసింది నిహారిక. ఆమె నటించిన మొదటి సినిమా ఒక మనసు పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె హీరోయిన్‌గా నటించిన వెబ్ సిరీస్ ముద్ద పప్పు ఆవకాయ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. ప్రస్తుతం తెలుగు లో వాట్ ది ఫిష్ సినిమా చేస్తోంది ఈ అమ్మడు.

తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా నిహారిక నటిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేయగా.. ఇప్పుడు ఆర్ డీ ఎక్స్ నటుడు షేన్ నిగమ్‌తో మరో తమిళం మూవీ చేస్తోంది. మద్రాస్ కారన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పిక్స్‌ ను ఇటీవలే ఆమె తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటోంది నిహారిక. డైలీ పిక్స్ తోపాటు అప్డేట్స్ ఇస్తుంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటుంది. తాజాగా కొత్త పిక్ ను షేర్ చేసింది నిహారిక. బేబీ పింక్ అండ్ వైట్ పొట్టి డ్రెస్ లో క్రేజీ పోజు ఇచ్చింది. షార్ట్ మిడ్డీలో నవ్వుతూ అందాలు ఆరబోసింది. ప్రస్తుతం నిహారిక పిక్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా డాటర్ నయా ఫొటోపై ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. నవ్వుతోనే మాయ చేస్తున్నావని కామెంట్స్ పెడుతున్నారు.

అయితే నిహారిక పెళ్లి అయిన కొన్నాళ్లకే తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది. కానీ వీరి విడాకులకు గల కారణాలు ఏంటనేది మాత్రం తెలియరాలేదు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక సోలోగా ట్రావెల్ చేస్తోంది. వరల్డ్ టూర్‌‌ ను ఎంజాయ్ చేస్తోంది.