Begin typing your search above and press return to search.

యంగ్ హీరో వల్ల చాలా ఫీలైన మెగా డాటర్!?

చివరకు ఫిబ్రవరి 28వ తేదీన షూట్ ప్లాన్ చేయమని, తప్పకుండా వస్తానని చెప్పారట. దీంతో ఆహా టీమ్ అంతా రెడీ చేసి ఆ హీరో కోసం ఎదురుచూశారట.

By:  Tupaki Desk   |   29 Feb 2024 1:00 AM GMT
యంగ్ హీరో వల్ల చాలా ఫీలైన మెగా డాటర్!?
X

టాలీవుడ్ ప్రముఖ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ నిహారిక కొణిదెల. నటిగా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నా.. హిట్లు మాత్రం సాధించలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న మెగా డాటర్.. మళ్లీ ఇప్పుడు వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసింది. తెలుగులో మంచు మనోజ్ వాట్ ది ఫిష్ తోపాటు కోలీవుడ్ లో మద్రాస్ కరన్ మూవీ చేస్తోంది.

అయితే నిహారిక ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం తెలిసిందే. ఆ మధ్య ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. ఎప్పుడూ కొత్త కొత్త ఛాలెంజెస్ తీసుకోవడంలో ముందుండే మెగా డాటర్ లో నటితోపాటు యాంకర్ కూడా ఉంది. ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ ను ఒకేసారి ఇంటర్వ్యూ చేసింది. ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత నిహా మళ్లీ హోస్ట్ గా సందడి చేయనుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా చెఫ్ మంత్ర సీజన్- 3ను హౌస్ట్ చేయనుంది నిహారిక. ఈ విషయాన్ని ఇప్పటికే ఆహా ప్రకటించింది. మార్చి 3న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుద్దని కూడా తెలిపింది. ఇప్పుడు ఈ షోలో నిహారికకు చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ కు ఓ టాలీవుడ్ యంగ్ హీరో.. తన సినిమా ప్రమోషన్లలో భాగంగా వస్తానని ఒప్పుకున్నారట. కానీ గత మూడు రోజులుగా షూట్ ను వాయిదా వేస్తున్నారట.

చివరకు ఫిబ్రవరి 28వ తేదీన షూట్ ప్లాన్ చేయమని, తప్పకుండా వస్తానని చెప్పారట. దీంతో ఆహా టీమ్ అంతా రెడీ చేసి ఆ హీరో కోసం ఎదురుచూశారట. కానీ ఆ నటుడు రాలేదట. అలా మధ్యాహ్నం అయిపోయిందట. కనీసం కాల్స్ కు కూడా రెస్పాండ్ అవ్వలేదట. చివరకు కుకరీ షోపై తనకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పారట. చేసేదేం లేక షూట్ క్యాన్సిల్ చేశారట. దీంతో టీమ్ అంతా నిరాశగా వెనుదిరిగారట.

ఆ యంగ్ టాలీవుడ్ హీరో బిహేవియర్ తో ఆహా అధినేత అల్లు అరవింద్ తోపాటు నిహారిక చాలా ఫీల్ అయ్యారట. ముందే రానని చెప్పి ఉంటే.. మరో గెస్ట్ ను పిలుచుకునేవాళ్లం కదా అని అనుకున్నారట. సీజన్-3 కాబట్టి.. మార్చి 3న స్టార్ట్ చేయాలని ఆహా నిర్వాహకులు అనుకున్నారట. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ షూట్ క్యాన్సిల్ కావడంతో ఆ డేట్ ఏమైనా ఛేంజ్ అవుతుందా? లేక అదే డేట్ న స్ట్రీమింగ్ చేస్తారా? అన్నది చూడాలి మరి.