Begin typing your search above and press return to search.

వైట్ ఫ్రాక్‌లో మెగా ప్రిన్సెస్ క‌ట్టి ప‌డేసే అందం

2019లో విడుద‌లైన 'సూర్యకాంతం'లో నిహారిక చ‌క్క‌గా న‌టించి మెప్పించింది. అదే స‌మ‌యంలో WTF కథనం విని నిహారిక ఎగ్జ‌యిట్ అయిందిట‌

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:16 AM GMT
వైట్ ఫ్రాక్‌లో మెగా ప్రిన్సెస్ క‌ట్టి ప‌డేసే అందం
X

గ‌డిచిన నాలుగేళ్లుగా మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల న‌ట‌న‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు మంచు మనోజ్ త‌దుప‌రి చిత్రం 'వాట్ ది ఫిష్‌'లో బలమైన పాత్రతో కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. డెబ్యూ వరుణ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నిహారిక పాత్ర పేరు అష్ట‌లక్ష్మి. యాష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. నిహారిక పాత్ర వెన్నెముక లాంటిది అని, చక్క‌ని నిడివితో ఆక‌ట్టుకుంటుంద‌ని, ఎన‌ర్జీని పెంచే పాత్ర‌లో నిహారిక మెరిపించ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే వెల్ల‌డించాడు.


2019లో విడుద‌లైన 'సూర్యకాంతం'లో నిహారిక చ‌క్క‌గా న‌టించి మెప్పించింది. అదే స‌మ‌యంలో WTF కథనం విని నిహారిక ఎగ్జ‌యిట్ అయిందిట‌. నియో-నోయిర్ థ్రిల్లర్ క‌థాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ క‌థ‌ భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఒక‌ గ్లోబల్ సబ్జెక్ట్‌ని ట‌చ్ చేస్తుంది. డార్క్ కామెడీ మిక్స్‌తో ఎంటర్‌టైనింగ్ మూవీగా రూపొందుతుంది. వాట్ ద ఫిష్ చిత్రంతో మంచు మనోజ్ కూడా ఆరేళ్ల‌కు తిరిగి వ‌స్తున్నాడు. హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శీతాకాలం దాటిన తర్వాత కెనడాలో మొదటి షెడ్యూల్‌ షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం మొదట తెలుగులో తెర‌కెక్కి ఇత‌ర భాష‌ల్లోకి అనువాద‌మ‌వుతుంది.


క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్:


నిహారిక ఇటీవ‌ల‌ త‌న ఇంట్లో ప్ర‌తి పండుగ‌ను సంబ‌రంగా జ‌రుపుకుంటోంది. ఇంత‌కుముందే వ‌రుణ్- లావ‌ణ్య పెళ్లి వేడుక అనంత‌ర వేడుక‌ల్లో బోలెడంత సంద‌డి చేసింది. ఇంత‌లోనే ఇప్పుడు మెర్రీ క్రిస్మ‌స్ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. వ‌రుణ్ - లావ‌ణ్య దంప‌తుల మెగా క్రిస్మ‌స్ పార్టీలోను నిహారిక సంద‌డి చేసింది. తాజాగా వైట్ క‌ల‌ర్ హాఫ్ షోల్డ‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లో నిహారిక క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. నిహారిక ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఎంతో ల‌వ్ లీగా క‌నిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే నిహారిక కొంత బ‌బ్లీగా క‌నిపిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా నిహారిక లుక్ చాలా ఆకర్ష‌ణీయంగా ఉంది. త‌దుప‌రి కథానాయిక‌గా ఉన్న‌త స్థానాల‌కు ఎదుగుతుంద‌ని కూడా నిహారిక అభిమానులు బ్లెస్ చేస్తున్నారు.