Begin typing your search above and press return to search.

నిహారిక మరో బిగ్ డిసిషన్

అలాగే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక కొనెదల ఓ ఐదు సినిమాల వరకు చేశారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:39 AM GMT
నిహారిక మరో బిగ్ డిసిషన్
X

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకి పైగా హీరోలు ఉన్నారు. ఒకరిద్దరు తప్ప అందరూ స్టార్స్ గానే తమ ఇమేజ్ ని కొనసాగిస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక కొనెదల ఓ ఐదు సినిమాల వరకు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఫింక్ఎలిఫెంట్ అనే బ్యానర్ పెట్టి వెబ్ సిరీస్ లు ప్రస్తుతం నిహారిక నిర్మిస్తోంది.

రీసెంట్ గా డెడ్ ఫిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో లీడ్ రోల్ లో ఆమె నటించడం విశేషం. ఇప్పుడు అమెజాన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ కి నిహారిక ప్లాన్ చేస్తుందంట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పడం విశేషం.దీని తర్వాత బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టి నిర్మాతగా సినిమాలు చేస్తానని నిహారిక చెబుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి సుస్మిత కొనెదల నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.

ఆమె రెండు చిన్న సినిమాలు చేసింది. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇప్పుడు ఏకంగా తండ్రితో పెద్ద ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించే పనిలో ఉంది. మెగాస్టార్ కూడా కూతురుని మెగా ప్రొడ్యూసర్ గా నిలబెట్టడానికి తనవంతు సాయం చేస్తున్నారు. ఇప్పుడు అక్క దారిలోనే నిహారిక కూడా బిగ్ స్క్రీన్ పైకి వచ్చి ప్రొడ్యూసర్ గా మారాలని కులలు కంటున్నారు.

దానికి సంబంధించి రూట్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ లో సక్సెస్ ఫుల్ గా తన జర్నీని నిహారికా కొనసాగిస్తోంది. ఇక బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మొదటి ప్రాజెక్ట్ ని ఆమె మెగా హీరోతో స్టార్ట్ చేస్తుందా లేదంటే సుస్మిత తరహాలో చిన్న బడ్జెట్ సినిమా చేసిన తర్వాత మెగా ఫ్యామిలీ హీరోతో మూవీ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇక వీరిద్దరి దారిలోనే మరో మెగా డాటర్ శ్రీజ కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో తన ప్రయాణం శ్రీజ మొదలుపెట్టారు. మెల్లగా ప్రొడక్షన్ వైపు తన అడుగులు వేస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి కుర్రాళ్ళు అందరూ హీరోలుగా వస్తే, అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ గా మారుతున్నట్లు ఉన్నారనే మాట వినిపిస్తోంది.