Begin typing your search above and press return to search.

ఆ హీరోతో నిహారిక.. గ్రాండ్ రీ ఎంట్రీ

అలా ఆమె నిర్మించిన డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ తో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్ లో ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 1:02 PM GMT
ఆ హీరోతో నిహారిక.. గ్రాండ్ రీ ఎంట్రీ
X

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఒకే ఒక్క నటి నిహారిక కొణిదెల. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్. ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్ గా కనిపించిన నిహారిక.. ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో లో హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించింది. కానీ సరైన హిట్ దక్కించుకోలేకపోయింది.

దీంతో సినిమాలకు మెల్లగా దూరమైన నిహారిక.. ఆ మధ్య పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. దాని ద్వారా వెబ్ కంటెంట్ ను తెరకెక్కిస్తోంది. అలా ఆమె నిర్మించిన డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ తో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్ లో ఉంటుంది. అయితే ఆమె తిరిగి సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

ఎట్టకేలకు ఇప్పుడు నిహారిక సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత మెగా డాటర్.. మద్రాస్కరణ్ అనే తమిళం మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇటీవల భారీ హిట్ అయిన 'ఆర్డీఎక్స్' ఫేమ్ మాలీవుడ్ నటుడు షేన్‌ నిగమ్‌ కు జోడీగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఎస్‌ ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది షేన్ నిగమ్ తమిళ డెబ్యూ మూవీ కావడం విశేషం.

నిహారికకు ఇది రెండో తమిళ చిత్రం. గతంలో ఒరు నల్ల బల్ పాతు సోల్రన్ అనే తమిళ సినిమాలో నటించింది మెగా డాటర్. తాజాగా ఈ సినిమా నుంచి నిహారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీతోపాటు నిహారిక.. మంచు మనోజ్ తో వాట్ ద ఫిష్ అనే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె బర్త్ డే సందర్భంగా ఆ మూవీ మేకర్స్ నిహారిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇక నిహారిక రీ ఎంట్రీ గురించి తెలుసుకున్న మెగా ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సినిమా విజయం సాధించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం నిహారికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.