Begin typing your search above and press return to search.

నిహారిక ఆహా షో.. డబుల్ మీనింగ్స్ తోనే..

ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీసులను పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   21 March 2024 5:11 AM GMT
నిహారిక ఆహా షో.. డబుల్ మీనింగ్స్ తోనే..
X

ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీసులను పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని ఏకంగా సొంతంగా తెరకెక్కిస్తున్నాయి. రకరకాల షోలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓన్లీ తెలుగు ఓటీటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది ఆహా సంస్థ. ఆ తర్వాత తమిళంలోకి కూడా విస్తరించింది. స్టార్టింగ్ లో అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీసులను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

ఇక ఓటీటీ మార్కెట్ లో అభివృద్ధి చెందాలంటే వైవిధ్యమైన కంటెంట్ ను స్ట్రీమింగ్ చేయాలని అర్థం చేసుకుందేమో.. అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అనేక షోలను ప్రేక్షకుల కోసం తీసుకొచ్చింది. అయితే వాటిలో అన్ స్టాపబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ఈ షో.. ఇప్పటికే మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. మంచి పేరు కూడా సంపాదించింది.

ఆ తర్వాత ఆహా.. కాస్త స్లో అయింది. మార్కెట్ లో నిలబడడానికి ఏదో ఒకటి చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న చెఫ్ మంత్రను రీస్టార్ట్ చేసింది. మూడో సీజన్ కు మెగా డాటర్ నిహారిక హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇదివరకే రెండు ఎపిసోడ్లు..స్ట్రీమ్ అవ్వగా తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈసారి గెస్ట్లుగా హీరో నవదీప్, నటి తేజస్వి వచ్చారు. వీరిద్దరు అల్లరితో సందడి చేశారు.

అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిహారిక.. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు పొట్టి బట్టలే వేసుకుంటోంది. కానీ షోకు రాసిన స్క్రిప్ట్ అంతా డబుల్ మీనింగ్ లే. గెస్టులకు అన్నీ డబుల్ మీనింగ్ ప్రశ్నలే అడుగుతున్నారు. మూడో ఎపిసోడ్ ప్రోమో చూస్తే.. ఇది వంటల షోనా లేక డబుల్ మీనింగ్ గేమా అన్నట్లు అనిపిస్తోంది. నీ డాష్ కు ఎప్పుడైనా ఫొటో తీసి పంపావా, నీ డ్యాష్ హ్యపీ అంటూ వెకిలి ప్రశ్నలు.. దానికి మళ్లీ నవ్వులు.

చివరకు ఈ ప్రశ్నలు తట్టుకోలేక.. రైటర్ బాగా కామాంధుడిలా ఉన్నాడని నవదీప్.. ఇది బెడ్రూం షోలా ఉందని తేజస్వి కామెంట్స్ చేసేశారు. మొత్తానికి ఈ అడల్ట్ కామెడీపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ఫ్యామిలీ షో అనుకుంటే ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయేంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇలాంటి డైలాగులతోనే ఆహా.. తన షో హిట్ అవ్వాలని చూస్తోందని అంటున్నారు. కొందరు సీరియస్ కూడా అవుతున్నారు. మరి ఆహా.. ఈ అడల్ట్ డైలాగులు తగ్గిస్తుందో లేదో చూడాలి.