Begin typing your search above and press return to search.

ఆ కేసులో అన్యాయంగా ఇరికించారు: నిహారిక‌

గ‌తం గ‌త‌హా అన‌కుంటే వ‌ర్త‌మానంలో మ‌రోసారి నాటి ఘ‌ట‌న‌ను ప్ర‌స్థావించారు నిహారిక కొణిదెల‌. అప్పుడు త‌న‌ను అన్యాయంగా ఇరికించార‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   17 March 2024 7:19 AM GMT
ఆ కేసులో అన్యాయంగా ఇరికించారు: నిహారిక‌
X

రెండేళ్ల క్రితం హైద‌రాబాద్ రాడిస‌న్ ప‌బ్ పై పోలీసుల‌ దాడి కేసులో 114 మంది ప్ర‌ముఖుల పేర్లు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. వీరంతా డ్ర‌గ్స్ పార్టీ చేసుకున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో ఆ ప‌బ్ లోంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల పేరును మీడియా హైలైట్ చేసింది. అయితే ఆ త‌ర్వాత త‌న‌కు డ్ర‌గ్స్ తో ఎలాంటి సంబంధం లేద‌ని, విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని నిహారిక కొణిదెల ప్ర‌క‌టించారు.

గ‌తం గ‌త‌హా అన‌కుంటే వ‌ర్త‌మానంలో మ‌రోసారి నాటి ఘ‌ట‌న‌ను ప్ర‌స్థావించారు నిహారిక కొణిదెల‌. అప్పుడు త‌న‌ను అన్యాయంగా ఇరికించార‌ని అన్నారు. స్కూల్ స్నేహితులంతా ఆ రోజు అక్క‌డ క‌లుసుకున్నాం. సౌండ్ మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని మ‌ధ్య‌లో నేను బ‌య‌టికి వ‌స్తే అక్క‌డ పోలీసులు ఉన్నారు. ఆ త‌ర్వాతే తెలిసింది ఎవ‌రో డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని, అందుకే పోలీసులు విచారిస్తున్నార‌ని వెల్ల‌డైంది. ఆ స‌మ‌యంలో నా పేరును ఇరికిస్తూ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి'' అని నిహారిక అన్నారు.

పున‌ర్వివాహంపై నిజాయితీగా:

నిహారిక కొణిదెల టాలీవుడ్ లో ప్రతిష్టాత్మక సినీ కుటుంబం నుండి వచ్చిన న‌టి. న‌ట‌నారంగంలో కెరీర్ ప్రయాణం, వివాహం అనంత‌రం విడాకుల వ్య‌వ‌హారం ప్ర‌తిదీ తెలిసిన‌వే. ఇటీవల తాను నిర్మిస్తున్న 'సాగు' చిత్రం ప్రచార ఇంటర్వ్యూలో నిహారిక తన భవిష్యత్ ప్రణాళికలను నిజాయితీగా చర్చించింది. పున‌ర్ వివాహానికి ఆస్కారం ఉందా లేదా? అన్న‌ది కూడా ప్ర‌స్థావించింది.

నిహారిక కొణిదెల చైతన్య జోనలగడ్డను 2023లో వివాహం చేసుకుంది. కానీ త‌న‌ విడాకుల గురించి కొద్ది కాలంలోనే పుకార్లు మొదలయ్యాయి. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన మాజీ భర్త నుండి విడాకులు తీసుకున్నట్లు ధృవీకరించారు. తన వివాహం విఫలమవడానికి దారితీసిన ఇతర అంశాలు కూడా ఉన్నాయని ఏదో ఒక కారణంతోనే ముగించామ‌ని అన‌డం అన్యాయమని నిహారిక‌ నొక్కి చెప్పింది.

ఇక పున‌ర్ వివాహం విషయానికి వస్తే నిహారిక రియలిస్టిక్ గా ఉంది. తనకు పిల్లలు కావాలని కూడా అంగీకరించింది. అయితే ఏదో ఒక కార‌ణంతో పెళ్లిని ఆలస్యం చేయడంలోని ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పింది. ప్రేమ వివాహం లేదా పెద్ద‌లు కుదిర్చే వివాహం చేసుకుంటుందా? అన్న‌దానిపై తటస్థంగా ఉంది. ప్రస్తుతానికి కెరీర్ ప్రాధాన్యతలపై దృష్టి సారించిన‌ట్టు నిహారిక తెలిపింది.

'సాగు'లో వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలు పోషించారు దీనిని నిహారిక సొంత‌ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఈ చిత్రం OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.