Begin typing your search above and press return to search.

నిహారిక మరో ప్రయత్నం.. 'కల్కి' దర్శకుడి ఆశీర్వాదం!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో, సిరీస్‌ల్లో నటించింది. నిర్మాతగానూ నిహారిక పలు ప్రాజెక్ట్‌లు చేసింది.

By:  Tupaki Desk   |   2 July 2025 11:19 AM
నిహారిక మరో ప్రయత్నం.. కల్కి దర్శకుడి ఆశీర్వాదం!
X

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో, సిరీస్‌ల్లో నటించింది. నిర్మాతగానూ నిహారిక పలు ప్రాజెక్ట్‌లు చేసింది. పింక్ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిహారిక పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, వెబ్‌ సిరీస్‌లను నిర్మించింది. సినిమాల నిర్మాణం కూడా గత సంవత్సరం నుంచి మొదలు పెట్టింది. గత ఏడాది కమిటీ కుర్రాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. కనుక నిర్మాతగా నిహారిక మరిన్ని సినిమాలు చేసేందుకు గాను రెడీ అయింది. మరో చిన్న సినిమాను నిర్మించేందుకు గాను నిహారిక సిద్ధం అయింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

సంగీత్‌ శోభన్‌ హీరోగా నయన్ సారిక హీరోయిన్‌గా నిహారిక ఒక సినిమాను నిర్మించబోతుంది. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించబోతుంది. నిహారిక గతంలో నిర్మించిన బెంచ్‌ లైఫ్ అనే వెబ్‌ సిరీస్‌తో దర్శకురాలిగా పరిచయం అయి మంచి గుర్తింపు దక్కించుకున్న మానస శర్మ ఒక న్యూ ఏజ్‌ కామెడీ లవ్‌ స్టోరీతో ఈ సినిమాను రూపొందించబోతుంది. నిహారిక, మానస శర్మ మధ్య స్నేహం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇద్దరి కాంబోకి కచ్చితంగా హిట్‌ పడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు లాంచనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు అయ్యారు.

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కల్కి సినిమాతో పాన్‌ ఇండియాను మించి గ్లోబల్‌ రేంజ్‌లో సందడి చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ హాజరు అయ్యాడు. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా మొదటి షాట్‌ కి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆయన ఈ సినిమా స్టోరీ లైన్ విని చాలా బాగుందని అన్నాడట. తప్పకుండా యూత్‌ తో పాటు అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసంను ఆయన వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో సంగీత్‌ శోభన్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాడు. కామెడీ సినిమాలకు అతడు ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్‌ అయ్యాడు. అంటే కామెడీని ఆ రేంజ్‌లో చేస్తున్నాడు.

వర్షం వంటి సూపర్‌ హిట్‌ సినిమాను తెరకెక్కించిన శోభన్‌ చిన్న కొడుకు సంగీత్‌ శోభన్‌. చాలా కాలంగా ఇతడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇతడి అన్న ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ ఇతడు ఓటీటీ సినిమాలతో, వెబ్‌ సిరీస్‌లతో బాగానే పాపులారిటీ సొంతం చేసుసుకున్నాడు, మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమాలతో మరింతగా ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ఈ సినిమా అతడికి మరో విజయాన్ని కట్టబెడుతుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. నిహారిక ఈ సినిమాతో నిర్మాతగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.