సీనియర్ హీరోయిన్ వారసుడు.. రాజమౌళితో జస్ట్ మిస్!
ఇక సీనియర్ నటి కుమారుడు కూడా మొదట ఈ సినిమాలో నటించాల్సింది. కానీ అతనికి ఈ ఆఫర్ చివరి నిమిషంలో మిస్సయ్యింది.
By: Tupaki Desk | 21 July 2025 3:10 PM ISTటాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రాజెక్టులలో బాహుబలి టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ విజువల్ గ్రాండియర్ రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట్లో చర్చనీయాంశమైంది.
బాహుబలి సినిమా క్యాస్టింగ్ ప్రక్రియ మొదటి నుంచి అనేక ట్విస్టులతో సాగిందట. సూర్య కట్టప్ప, శ్రీదేవి శివగామి పాత్రల కోసం సంప్రధించినా వారు రకరకాల కారణాల వలన చేయలేదు. ఇక మరికొందరు నటులను మొదట అనుకున్నప్పటికి షూటింగ్ సమయానికి వారిని మార్చేశారు. ఇక సీనియర్ నటి కుమారుడు కూడా మొదట ఈ సినిమాలో నటించాల్సింది. కానీ అతనికి ఈ ఆఫర్ చివరి నిమిషంలో మిస్సయ్యింది.
నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టాడు. తనకు బాహుబలి సినిమాలో ఓ కీలక పాత్ర చేసే అవకాశం వచ్చిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మిస్ అయ్యిందని చెప్పాడు. మొదట భల్లాలదేవ పాత్ర రానాకే కేటాయించిందట. కానీ రానా డేట్స్ అందుబాటులో లేకపోవడంతో నిర్మాతలు నిహార్‌ను సంప్రదించారట. నిహార్ కూడా ఓకే చెప్పి దాదాపు నాలుగు వారాల పాటు శిక్షణలో పాల్గొన్నాడు.
అయితే కొద్దిరోజుల తర్వాత రానా డేట్స్ సెట్ కావడంతో మళ్లీ ఆ పాత్రను ఆయనకే అప్పగించారు. దాంతో నిహార్‌ను కాలకేయుడి పాత్ర కోసం అడిగారు. ఆ పాత్రకు సంబంధించిన, మేకప్ స్టైల్ గురించి వివరించగా, అది పూర్తిగా ప్రోస్థటిక్ మేకప్‌తో ఉంటుందని తెలిసింది. ఈ విషయాన్ని నిహార్ తన తల్లి జయసుధతో చర్చించగా, ఆమె ‘నీ మొదటి సినిమాలో ముఖం కనపడకపోతే ప్రేక్షకులు గుర్తించలేరు’ అని సలహా ఇచ్చారట.
దాంతో నిహార్ ఆ పాత్రను చేయనని నిర్ణయించుకున్నాడు. ఆ పాత్ర తర్వాత ప్రభాకర్ చేశాడు. అయితే తెరపై అది పూర్తిగా డిఫరెంట్‌గా, ఆకర్షణీయంగా కనిపించిందని నిహార్ అంగీకరించాడు. ఈ అవకాశాన్ని మిస్ అయినా తాను బాధపడటం లేదని నిహార్ చెబుతున్నాడు. మొదటి నుంచి రాజమౌళి అన్నీ విషయాలు నేరుగా తనతో మాట్లాడారని, ఆయనతో పని చేయడమే ఒక గొప్ప అనుభవంగా భావిస్తున్నానని అన్నాడు. తాను ఆ తర్వాత షూటింగ్‌కి కూడా వెళ్లాడట, సరదాగా సెట్‌ని చూసేందుకు. ఈ అనుభవాన్ని జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని నిహార్ పేర్కొన్నాడు.
