హరిహరలో పవన్ పక్కనున్న పొడుగు వ్యక్తి ఎవరంటే?
అయితే ఈ సినిమాలో పవన్ పక్కనే సపోర్టింగ్ రోల్ లో ఓ పొడువైన వ్యక్తి నటించారు. ఆయన పాత్రకు డైలాగులు లేకపోయినా, పవన్ తో పాటు చాలా సేపు స్క్రీన్ పై కొనసాగింది.
By: Tupaki Desk | 25 July 2025 3:06 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాలో పవన్ పక్కనే సపోర్టింగ్ రోల్ లో ఓ పొడువైన వ్యక్తి నటించారు. ఆయన పాత్రకు డైలాగులు లేకపోయినా, పవన్ తో పాటు చాలా సేపు స్క్రీన్ పై కొనసాగింది. అతడి లుక్స్ , స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్రలో నటించింది ఎవరో కాదు ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్.
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్, నిహార్ పాత్ర గురించి మాట్లాడారు. నిహార్ పాత్ర 'ఫ్రాంటియర్ గాంధీ' గా ప్రసిద్ధి చెందిన పస్తున్ స్వాతంత్ర్య కార్యకర్త అబ్దుల్ గఫర్ ఖాన్ నుండి ప్రేరణ పొందిందని పవన్ అన్నారు. ఈ సినిమాలో నిహార్ నటనకుగానూ పనన్ ప్రశంసలు కురిపించారు. అతని పనితనం, తన పాత్రను సక్సెస్ మీట్ లో ప్రస్తావించారు. అటు ప్రేక్షకులు కూడా నిహార్ పాత్ర, నటనకు మెచ్చుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ లో విలన్ పాత్రల కోసం చిత్ర నిర్మాతలు ఇతర పరిశ్రమల నుండి నటులను తీసుకొస్తున్నారు. ఇటీవల భారీ బడ్జెట్, బడా హీరోల సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషించిన నటుడు బయటి ఇండస్ట్రీలకు చెందినవారే కావడం గమనార్హం. అయితే తాజాగా హరిహర సినిమాలో నిహార్ కపూర్ నటనతో తెలుగులో నెగిటివ్ పాత్ర కోసం దర్శకులకు తొలి ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది.
కాగా, నిహార్ కపూర్ 2022లో విడుదలైన 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇక హరిహర వీరమల్లు అతని కెరీర్ లో పెద్ద చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా అతని కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా నిహార్ కెరీర్ లో ఏ మేర అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి.
ఇక పవన్ కళ్యాన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన హరిహర సినిమా జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రీమియర్స్, ఓపెనింగ్ డే వసూళ్లు రూ. 70 కోట్లకు పైగా ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఏ ఎం రత్నం దీన్ని నిర్మించారు.
