Begin typing your search above and press return to search.

నైట్ పార్టీలో కాక‌లు పుట్టించిన యువ‌జంట‌ కౌగిలింత‌

By:  Tupaki Desk   |   3 Sep 2023 4:00 PM GMT
నైట్ పార్టీలో కాక‌లు పుట్టించిన యువ‌జంట‌ కౌగిలింత‌
X

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు స‌న్నీడియోల్ చాలా కాలానికి అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ హుషారులో అత‌డు వ‌రుస సక్సెస్ పార్టీల‌తో ఇండ‌స్ట్రీని ప‌ల‌క‌రిస్తున్నాడు. తాజాగా జ‌రిగిన స‌క్సెస్ పార్టీలో 16 సంవ‌త్స‌రాల శ‌త్రుత్వానికి వీడ్కోలు ప‌లుకుతూ షారూఖ్ ని డియోల్ ప‌ల‌క‌రించ‌డం, కౌగిలించుకోవ‌డం సంచ‌ల‌నం అయింది.

ఇక గదర్ 2 సక్సెస్ పార్టీలో సారా అలీ ఖాన్ త‌న EX ప్రేమికుడు కార్తీక్ ఆర్యన్‌ను కౌగిలించుకుంది. లవ్ ఆజ్ కల్ 2 సమయంలో ఈ యువ‌జంట‌ డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క్ర‌ష్ ఇప్ప‌టికీ అలానే ఉందనేది నెటిజ‌నుల మాట‌. అయితే చాలామంది పార్టీలో వారి కౌగిలింత‌ను ఆక్వార్డ్ అంటూ కామెంట్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సారా అలీ ఖాన్ - కార్తీక్ ఆర్యన్ గదర్ 2 సక్సెస్ పార్టీలో ఒకరినొకరు ఢీకొట్ట‌డం వింతైన స్ప‌ర్శ‌కు లోన‌వ్వ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అక్కడ విచిత్రమైన కౌగిలింతతో ఆశ్చ‌ర్య‌పరిచార‌ని లైవ్ గా వీక్షించిన‌వారు కామెంట్లు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గదర్ 2 పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్ తదితరులు సన్నీ డియోల్ తో పాటు చేరారు. మాజీలు సారా అలీ ఖాన్- కార్తీక్ ఆర్యన్ జంట ఈ పార్టీకి ప్ర‌త్యేక‌త‌ను తెచ్చార‌నేది గుస‌గు. లవ్ ఆజ్ కల్ 2 సమయంలో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చినప్ప‌టి నుంచి ఈ జంట పార్టీల్లో క‌లుసుకుంటే అది మీడియా ర‌చ్చ‌కు దారి తీస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే సారా, కార్తీక్ ల ప్ర‌వ‌ర్త‌న కూడా అగ్నికి ఆజ్యం పోస్తోంది.

ఈ జంట గ‌ద‌ర్ 2 పార్టీలో ఒకరినొకరు కొట్టుకుంటూ ఛీర్ చేసారు. కార్తీక్ సల్మాన్‌తో కలిసి పార్టీలోకి ప్రవేశించడం కనిపించింది. అయితే మాజీ ప్రియురాలు సారా ఆమె సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి పార్టీకి విచ్చేసింది. ప్రవేశ ద్వారం దగ్గర సైఫ్ అలీ ఖాన్ కుమార్తెను గుర్తించిన సల్మాన్ ఆమెను కౌగిలించుకోవడానికి ఆగిపోయాడు. అయితే దానిని అసహ్యంగా ఫీలైన సారా కార్తీక్ వైపు తిరిగింది. వారు కౌగిలించుకున్నారు. ఇది మాత్రమే కాదు.. కృతి సనన్ - ముఖేష్ ఛబ్రాతో పాటు మాజీ ప్రేమికులు జంట‌గా వెళుతూ క‌నిపించారు. పార్టీని వీడి, తన కారు వద్దకు వెళ్లే ముందు సారా మరోసారి కార్తీక్‌ను కౌగిలించుకుంది. కానీ ఈసారి ఈ కౌగిలి మ‌రింత ఘాడంగా వెచ్చగా ఉందంటూ నెటిజ‌నులు కామెంట్లు చేసారు. ప్ర‌స్తుతం ఈ జంట ఘాడ‌మైన కౌగిలింత అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.