Begin typing your search above and press return to search.

అదే నిజ‌మైతే నిధి నిరాశ‌కు బ్రేక్!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 109వ చిత్రం బాబి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 April 2024 2:30 AM GMT
అదే నిజ‌మైతే నిధి నిరాశ‌కు బ్రేక్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా 109వ చిత్రం బాబి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మాస్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ భారీ అంచ‌నాల మ‌ధ్య మాస్ కా బాప్ అనిపించేలా బాబి తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. దీంతో అంచ‌నాలు సినిమాపై అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. బాల‌య్య ని ఎంత‌టి మాస్ రోల్ లో చూపిస్తున్నాడు? అత‌డి లుక్ ఎలా ఉండ‌బోతుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.

ఈ నేప‌థ్యంలో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కొచ్చింది. ఇందులో అందాల తార నిధి అగ‌ర్వాల్ ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. అయితే నిధి బాల‌య్య‌కి జోడీగా రొమాన్స్ చేస్తుందా? కీల‌క పాత్ర అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. ఇంత‌వ‌ర‌కూ బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది క్లారిలీ లేదు. వాళ్లు ..వీళ్లు న‌టిస్తున్నార‌నే ప్ర‌చారం త‌ప్ప స‌రైన స‌మాచారం లేదు. తాజాగా నిధి ఎంట్రీతో! ఆ ఛాన్స్ ఆమె తీసుకుంటుందా? అన్న‌ది చూడాలి. ఇదే నిజ‌మైతే నిధి పంట పండిన‌ట్లే. అమ్మ‌డు రెండేళ్ల‌గా అవకాశాల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తోంది.

పీకే స‌ర‌స‌న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` లో ఛాన్స్ అందుకున్నా? అది మ‌ధ్య‌లో ఆగిపోయింది. అది తిరిగి మొద ల‌వుతుందా? లేదా? అన్న‌ది కూడా తెలియ‌దు. దీంతో నిధి అగ‌ర్వాల్ మ‌రింత నిరుత్సాహ ప‌డింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బాల‌య్య ఛాన్స్ నిజ‌మైతే బూస్టింగ్ లాంటింద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం బాల‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తికాగానే మ‌ళ్లీ షూట్ లో బిజీ అవుతారు. అంత‌వ‌ర‌కూ బాల‌య్య లేని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారు.

దీనిలో భాగంగా నిధి అగ‌ర్వాల్ పై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాల్ని హైదరాబాద్ లో చిత్రీక‌రించారు. దీనిలో భాగంగా బాల‌య్య‌పై కొన్ని భారీ యాక్ష‌న్ స‌న్నివే శాలు తెర‌కెక్కించారు. సినిమాలో ఈ స‌న్నివేశాలు బాల‌య్య‌ని ఓ రేంజ్ లో హైలైట్ చేస్తాయ‌ని ప్ర‌చారం సాగింది.