Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ బ్యూటీ ఇకనైనా ఫోకస్ చేస్తే బెటర్..!

పూరీ చేతిలో పడ్డాక హీరోయిన్ ఫేట్ మారుతుంది అంతే. ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది

By:  Tupaki Desk   |   18 April 2024 4:25 AM GMT
ఇస్మార్ట్ బ్యూటీ ఇకనైనా ఫోకస్ చేస్తే బెటర్..!
X

అదేంటో కొంతమంది హీరోయిన్స్ కు ఆడియన్స్ లో పాపులారిటీ ఉన్నా సరే.. వరుస అవకాశాలు వస్తున్నా సరే వాటిని కాదని దూరంగా ఉంటూ ఉంటారు. సినిమా ఆఫర్లు కాదని సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వారి గురించి చెబితే మొదట ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ సినిమాల్లో నటించిన నిధి ఆ రెండు సినిమాలు ఫెయిల్ అవగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ను మెప్పించింది.

పూరీ చేతిలో పడ్డాక హీరోయిన్ ఫేట్ మారుతుంది అంతే. ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో అమ్మడి గ్లామర్ షోకి సినీ ప్రియులంతా పడిపోయారు. కానీ ఆ తర్వాత ఆ దూకుడు చూపించడంలో విఫలమైంది నిధి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పవర్ స్టార్ తో హరి హర వీరమల్లు సినిమా ఛాన్స్ అందుకున్న నిధి ఆ సినిమా తర్వాత గల్లా అశోక్ సరసన హీరో సినిమాలో నటించింది.

ఈ గ్యాప్ లో కోలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన నిధి అక్కడ ఈశవరన్, భూమి సినిమాలతో తమిళ తంబీల మనసులు దోచేసింది. అక్కడ ఆమెకు గుడి కట్టే రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారంటే అమ్మడు ఏర్పరచిన ఇంపాక్ట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో మాత్రం నిధి అగర్వాల్ ను ఆడియన్స్ మర్చిపోయేలా చేసుకుంది. కేవలం ఇన్ స్టాగ్రాం ప్రమోషన్స్ లోనే కనిపించే నిధి ఇస్మార్ట్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది.

అయినా సరే నిధి అగర్వాల్ కోసం తెలుగు మేకర్స్ ఛాన్సులు ఇస్తున్నారు. ఈసారి ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకుంది అమ్మడు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్ లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఆ సినిమాలో ఆల్రెడీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఉన్నా కూడా అమ్మడు మరో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. నిధి కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని రాజా సాబ్ లో ఆమె ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేలా నిధిని చూపిస్తారని తెలుస్తుంది. మరి ఇప్పటికైనా నిధి టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుందా మళ్లీ వెనకడుగు వేస్తుందా అన్నది చూడాలి. నిధి అగర్వాల్ ఫ్యాన్స్ మాత్రం ఆమె వరుస సినిమాలు చేసి అలరించాలని కోరుతున్నారు.