Begin typing your search above and press return to search.

ప్ర‌తీ రోజూ రాత్రి అది ఉండాల్సిందే!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న అందంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల‌లో నిధి అగ‌ర్వాల్ కూడా ఒక‌రు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 5:00 PM IST
ప్ర‌తీ రోజూ రాత్రి అది ఉండాల్సిందే!
X

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న అందంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల‌లో నిధి అగ‌ర్వాల్ కూడా ఒక‌రు. స‌వ్య‌సాచి సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌మైన నిధి అగ‌ర్వాల్, ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించారు. కానీ నిధి అగ‌ర్వాల్ న‌టించిన సినిమాల్లో రామ్ స‌ర‌స‌న చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ తప్ప మిగిలిన‌వేవీ త‌న‌కు మంచి విజ‌యాల్ని తెచ్చిపెట్టింది లేదు.

నిధి కెరీర్లో స‌క్సెస్ రేట్ త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ అమ్మ‌డికి స్టార్ హీరోల సినిమాల్లో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నిధి చేతిలో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. అందులో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టిస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు కాగా, రెండోది పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ న‌టిస్తున్న ది రాజా సాబ్. ఈ రెండు సినిమాల‌పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ఈ రెండు భారీ ప్రాజెక్టులు త్వ‌ర‌లోనే ఆడియ‌న్స్ ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే నిధి అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. రెగ్యుల‌ర్ గా ఏదొక పోస్ట్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే నిధి తాజాగా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. త‌న‌కు ప్ర‌తీ రోజూ రాత్రి మర్డ‌ర్ మిస్ట‌రీ సినిమాలు చూసే అల‌వాటుంద‌ని, కొత్త కంటెంట్ దొర‌కడం లేద‌ని, ప్లీజ్ కొన్ని సినిమాలను చెప్ప‌మ‌ని, ఏ భాషైనా ప‌ర్లేద‌ని పోస్ట్ చేశారు.

నిధి అగ‌ర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, నిధి పోస్ట్ కు నెటిజ‌న్లు క్రేజీ గా కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు త‌న కెరీర్లో స‌రైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు త‌ను చేసిన సినిమాలు ఎలా ఉన్నా స‌రే, తన నుంచి రాబోయే రెండు సినిమాలు మాత్రం ఆడియ‌న్స్ ను అల‌రించి, పెద్ద స‌క్సెస్ అవాల‌ని కోరుకుంటున్నారు. ఈ రెండూ సినిమాలూ స‌క్సెస్ అయితే నిధి కెరీర్ కొత్త మ‌లుపు తిర‌గ‌డం ఖాయం.