Begin typing your search above and press return to search.

కాపీ కొట్టి దొరికిపోయిన హీరోయిన్.. మీమ్సే మీమ్స్..

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పెషల్ అటైర్ తో అట్రాక్షన్ గా నిలిచిన నిధి అగర్వాల్ చేతిపై రాతలు కనిపించడం ఇప్పుడు మీమర్స్ కు మెటీరియల్ గా మారింది.

By:  Tupaki Desk   |   22 July 2025 10:39 PM IST
కాపీ కొట్టి దొరికిపోయిన హీరోయిన్.. మీమ్సే మీమ్స్..
X

హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తన యాక్టింగ్ తో మెప్పిస్తోంది. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీతో సందడి చేయనున్న విషయం విదితమే. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో నిధి అగర్వాల్.. పంచమి రోల్ లో కనిపించనుంది. ఆ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకున్న అమ్మడు.. ఎంతో కష్టపడిందనే చెప్పాలి.

ఐదేళ్లపాటు వీరమల్లు సినిమా కోసం కేటాయించడం గమనార్హం. అయితే సినిమా ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషిస్తోంది అమ్మడు. ప్రతి ఈవెంట్ కు కూడా ఆమె పక్కాగా అటెండ్ అవుతూ సందడి చేస్తూనే ఉంది. రీసెంట్ గా మేకర్స్ నిర్వహించిన ప్రెస్ మీట్ తోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై మాట్లాడింది ముద్దుగుమ్మ.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పెషల్ అటైర్ తో అట్రాక్షన్ గా నిలిచిన నిధి అగర్వాల్ చేతిపై రాతలు కనిపించడం ఇప్పుడు మీమర్స్ కు మెటీరియల్ గా మారింది. వేదికపై మాట్లాడిన నిధి.. చివర్లో మూవీ డైలాగ్ చెప్పాలని సిద్ధమైనట్లు ఉంది. అందుకే చేతిపై రాసుకుని వచ్చిన.. ఆందీ వచ్చేసింది.. మనల్ని ఎవడ్రా ఆపేది.. అంటూ డైలాగ్ చెప్పింది.

డైలాగ్ చెప్పినప్పుడు చప్పట్లు, ఈలలు గట్టిగా వచ్చినా.. ఆమె చేయి చూసి డైలాగ్ చెప్పిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. కాపీ కొట్టిన హీరోయిన్ అంటూ మీమ్స్ వేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఫన్నీ మ్యూజిక్ ను యాడ్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. "ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చింది. ఇప్పుడు గ్రేట్ ఫుల్ గా ఫీలవుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు ఆయనతో నటించడం హ్యాపీగా ఉంది. జీవితాంతం ఇది గుర్తుపెట్టుకుంటాను. నా లైఫ్ లో స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇది" అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.