కొటిన్నర బంగారు ఆభరణాలు ధరించిన నటి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ చిత్రం 'హరిహరవీరమల్లు'లో నిధి అగ ర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 July 2025 3:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ చిత్రం 'హరిహరవీరమల్లు'లో నిధి అగ ర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు యువరాణి పంచమి పాత్ర లోకని పించనుంది. నిధి అగర్వాల్ కెరీర్ లో నే తొలి భారీ బడ్జెట్ చిత్రమిది. ఇంతవరకూ ఈ రేంజ్ సినిమాలో నిధి అగర్వాల్ నటించలేదు. తాను నటించిన తొలి స్టార్ హీరో కూడా పవన్ కళ్యాణ్ కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన నిధి అగర్వాల్ లుక్ సహా ప్రతీది ఆకట్టుకుంటుంది.
యువరాణి పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తన పాత్ర గురించి ఆసక్తిర విషయాలు పంచుకుంది. రోజు పాత్రకు తగ్గట్టు సిద్దమవ్వడానికి మ్యాకప్ అవ్వడానికే రెండు గంటలు సమయం పట్టేదని తెలిపింది. కోటిన్నర విలువగల ఆభరణాలు ధరించేదట. దీంతో ఒంటిపై భారీగా బరవు పడినట్లు అనిపించేదని తెలిపింది.
నిజమైన నగలు ధరించడం అంటే ఆషామాషీ కాదని పేర్కొంది. ఆభరణాలు ధరించి భరతనాట్యం చేయడం అన్నది అతి పెద్ద సవాల్ గా అనిపించేదంది. 'పీరియాడిక్ సినిమా కావడంతో పైటింగ్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి వచ్చింది. ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. అలాగే పాత్ర కోసం లుక్ మెయింటెన్ చేయడం కూడా సవాల్ గా అనిపించింది. లుక్ మారిపోకుండా కఠినమైన ఆహార నిమాలు పాటించాల్సి వచ్చిందిట.
దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. అలాగే నిధి అగర్వాల్ మొత్తం కెరీర్ గురించి కూడా స్పందించింది. అవకాశాలు మంచివే వచ్చాయి. కొన్నిసార్లు ఆ ఎంపికలు తప్పు అయి ఉండొచ్చు. కొన్ని అంచనాలు అందుకోకపోవచ్చు. అంతిమంగా మంచి సినిమాకే నా ఎంపిక ఉంటుంది. కెరీర్ ప్రారంభమైన రోజు లతో పోలిస్తే ఇప్పుడు మెరుగైన పాత్రలు ఎంచుకుంటున్నాను' అని తెలిపింది.
