Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : నిజమైన అందాల నిధిని చూడండి

సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.

By:  Tupaki Desk   |   24 Jun 2025 4:00 AM IST
పిక్‌టాక్‌ : నిజమైన అందాల నిధిని చూడండి
X

సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. పేరుకు తగ్గట్లుగానే అందాల నిధి ఈ అమ్మడు అనిపించే విధంగా చాలా అందంగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోల కారణంగా ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 30 మిలియన్‌లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో ఈ అమ్మడు సక్సెస్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు వస్తాయని ఆశించినా కూడా అదృష్టం ఈ అమ్మడికి కలిసి రాలేదు.


ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కెరీర్‌ బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వచ్చే నెలలో ఈ అమ్మడు నటించిన హరి హర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ పాత్రకు మంచి స్పందన వస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఈ అమ్మడు ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న రాజాసాబ్‌ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా కూడా ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాదిలో ఈ అమ్మడికి అతి పెద్ద రిలీజ్‌లు ఉన్నాయి.


ఈ రెండు సినిమాలతో టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ మారడం ఖాయం అనే నమ్మకంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఆ ఫోటోలు ఈమె స్థాయిని మరింత పెంచుతున్నాయి. తాజాగా అందమైన తన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మరోసారి నిధి అగర్వాల్‌ వైరల్‌ అవుతోంది. నిజంగా అందాల నిధి ఈ అమ్మడు అంటూ ప్రతి ఒక్కరూ కితాబిచ్చే విధంగా ఈ అమ్మడి ఫోటోలు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతటి అందాల నిధికి ఎందుకు ఇన్నాళ్లు సరైన బ్రేక్‌ పడలేదు అంటూ కొందరు కామెంట్‌ చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఈ ఏడాది ఈమెకు టర్న్‌ కావడం ఖాయం అంటున్నారు.


ఇండస్ట్రీలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. అందాల నిధి అగర్వాల్‌కి ఇకపై గుడ్‌ టైం షురూ అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. ఎన్నో విధాలుగా అందాల నిధికి స్టార్‌ హీరోయిన్‌ అయ్యేందుకు అర్హతలు ఉన్నాయి. కానీ అదృష్టం మాత్రం ఈమెకు కలిసి రాలేదు. అయినా కూడా ఈ అమ్మడు ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ముందు ముందు అయినా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా చూడాలి.