పవర్ స్టార్ తో సినిమా.. నిధి బిగ్ స్టేట్మెంట్..!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన నిధి అగర్వాల్ ఆ తర్వాత సరైన ఛాన్స్ లు అందుకోలేదు.
By: Tupaki Desk | 17 July 2025 7:43 PM ISTఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన నిధి అగర్వాల్ ఆ తర్వాత సరైన ఛాన్స్ లు అందుకోలేదు. ఐతే కోలీవుడ్ లో ఆఫర్లతో బిజీ అయిన అమ్మడు అక్కడ బిజీ హీరోయిన్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 24న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ జోరందుకోగా సినిమాకు పనిచేసిన నిధి తన అనుభవాలను పంచుకున్నారు.
ముఖ్యంగా పవర్ స్టార్ గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో పనిచేసే ఛాన్స్ రావడం లక్కీ అంటున్న నిధి ఎంత స్టార్డం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎక్కువమందికి రీచ్ అవుతుంది. అందుకే వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసినా ఒకటే అని అన్నారు నిధి అగర్వాల్.
ఆయనతో సినిమా చేస్తున్నంతసేపు ఎంతో నేర్చుకున్నానని.. సాహిత్యం మీద పవన్ గారికి మంచి పట్టు ఉందని.. ఆయన ఎంతో నాలెడ్జ్ పర్సన్ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఐతే లక్కీగా అమ్మడు ఒకేసారి పవన్, ప్రభాస్ లతో నటించే అవకాశం దక్కించుకున్నారు. రాజా సాబ్ సినిమాలో కూడా నిధి అగర్వాల్ యాక్ట్ చేసింది. ఐతే రాజా సాబ్ కూడా మంచి సినిమా అంటున్నారు నిధి.
అంతేకాదు పవన్ కళ్యాణ్, ప్రభాస్ గురించి చెబుతూ వాళ్లు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా చాలా హంబుల్ గా ఉంటారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు.. పాత్రలో ఆయన ఈజీగా ఒదిగిపోతారు అన్న నిధి.. ప్రభాస్ చాలా మంచి మనిషి ఆయన నిజంగానే డార్లింగ్ అంటూ చెప్పుకొచ్చారు.
ఆయనతో సినిమా వేరే సినిమాలు వంద ఒక్కటే అన్నది పవర్ స్టార్ మీద ఉన్న అభిమానంతో నిధి ఇచ్చిన స్టేట్మెంట్.. దీన్ని మరో విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక వీరమల్లు, రాజా సాబ్ రెండు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం మళ్లీ తెలుగులో నిధి హవా మొదలయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
