కర్మను అనుసరిస్తున్న యంగ్ హీరోయిన్?
చాలా మంది విధిని మార్చగలమని భ్రమిస్తారు. తాము ఏది అనుకుంటే అదే నడుస్తుందని కలలు కంటారు.
By: Tupaki Desk | 19 July 2025 9:20 AM ISTచాలా మంది విధిని మార్చగలమని భ్రమిస్తారు. తాము ఏది అనుకుంటే అదే నడుస్తుందని కలలు కంటారు. కానీ చివరిగా.. అవన్నీ కల్లలు అని ప్రూవ్ అవుతుంది. పైనుంచి ఒక బిగ్ బాస్ మానవ ప్రపంచాన్ని ఆపరేట్ చేస్తుంటాడు. అతడి ఆశీర్వాదం లేనిదే మోక్షం దక్కదని ఆధ్యాత్మిక గురువులు, భక్తులు చెబుతుంటారు. అయితే విధిని సైతం మార్చాలని ప్రయత్నించే దురంధరులకు ఈ సంఘంలో కొదవేమీ లేదు.
కానీ అంతిమంగా ప్రతి దురంధరుడు ఒక నిజం తెలుసుకుంటాడు. ఆ తర్వాత గౌతమ బుద్ధుడిలా మారతాడు. జైనుడిలా వెజిటేరియన్ మాత్రమే తింటాడు. ఇప్పుడు ఇదే కేటగిరీలో కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ఒక టాలీవుడ్ హీరోయిన్ చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. తాను కర్మ ప్రిన్సిపల్ ని నమ్ముతానని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేప్పుడు కచ్ఛితంగా జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమరాలజీని కూడా నమ్ముతానని చెప్పింది. అయితే చాలా చిన్న వయసులో ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని ఆకలింపు చేసుకున్న ఆ యువనటి ఎవరో తెలుసా?
నిస్సందేహంగా నిధి అగర్వాల్. ఉత్తరాది అమ్మాయి. టాలీవుడ్ లో అక్కినేని హీరోలతో కెరీర్ ప్రారంభించి చాలా దూరం ప్రయాణించింది. ఇప్పుడు ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటించింది. వీరమల్లు ఈ నెల 24న థియేట్రికల్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తాను కర్మ ప్రిన్సిపల్ ని అనుసరిస్తానని హోస్ట్ తో వెల్లడించింది. తినే ఆహారంలోను వెజిటేరియన్ కి నార్తర్న్ డిషెస్ కి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. అలాగే తన పేరులో అక్షరాలను న్యూమరాలజీ ప్రకారం ఎంపిక చేసుకున్నానని కూడా నిధి వెల్లడించింది.
ఇక నిధి వర్కవుట్లు, ఆహార అలవాట్లు తనలో మెరుపులకు కారణం. నియమ నిష్ఠలతో జీవనం సాగిస్తుంది గనుకనే నిధి అంత బ్యూటిఫుల్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బాలీవుడ్ లో హేమమాలిని, ఆమె కుమార్తెలు, మీరా రాజ్ పుత్, అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ సహా చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. సంఘంలో మెజారిటీ మేధోవర్గాలు భగవద్గీతను అనుసరిస్తున్నారు.
