నిధి అగర్వాల్ గ్యాప్ ని అలా భర్తీ చేసింది!
మరి హీరోయిన్ నిధి అగర్వాల్ పరిస్థితి ఏంటి? అంటే ఈ భామ ఈ సినిమా కోసమే ఐదున్నరేళ్లు కేటాయించింది.
By: Tupaki Desk | 18 July 2025 5:00 AM IST'హరిహరవీరమల్లు' ఐదున్నరేళ్ల తర్వాత రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ను మధ్య లోనే వదిలేసి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు. ఈ సినిమాపై కూర్చుంటే తన సమయమంతా వృధాగా పోతుందని భావించి షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అటు పై ఆ స్థానంలోకి జ్యోతికృష్ణ వచ్చాడు. మిగతా వాళ్లంతా కూడా వీరమల్లు షూటింగ్ ఉన్నప్పుడు రావడం చేసుకుని వెళ్లిపోవడం ఇతర సినిమాలతో బిజీ అయ్యారు కాబట్టి వాళ్లెవరికీ ఇబ్బంది లేదు. మరి హీరోయిన్ నిధి అగర్వాల్ పరిస్థితి ఏంటి? అంటే ఈ భామ ఈ సినిమా కోసమే ఐదున్నరేళ్లు కేటాయించింది.
మధ్యలో మరే సినిమా కూడా చేయలేదు. మరి ఈగ్యాప్ ను ఎలా భర్తీ చేసారంటే? వీరమల్లుపై తన అభిమానం, ప్రేమను చాటుకుంది. ఈ సినిమా చేస్తోన్న సమయంలోనే కొన్ని అవకాశాలు వచ్చాయంది. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించిందట. వీరమల్లుతో పాటు ఆ సినిమాలు కమిట్ అయితే? వీరమల్లు పాత్ర డిస్టర్బ్ అవుతుందని...సవ్యంగా నటించలేను అన్న భావనతో వచ్చిన అవకాశాలు వదులుకున్నట్లు తెలిపింది.
అలాగని తాను ఏమీ ఖాళీగా లేనంది. ఐదేళ్ల పాటు నెలకో యాడ్ చొప్పున చేసుకుంటూ తనకు కావాల్సిన అన్నింటిని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. ఆర్దికంగా ఇబ్బంది పడకుండా ఒక్కో యాడ్ చేయడం వల్ల కొంత డబ్బు సమకూరిందని..దాంతో ఈ ఐదేళ్ల పాటు బండి లాంగించినట్లు గుర్తు చేసుకుంది. అయితే మధ్య మధ్యలో 'రాజాసాబ్' షూటింగ్ కి హాజరైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో తాను కూడా ఒకర్తే. కాల్షీట్లు సర్దుబాటు కావడంతో మ్యానేజ్ చేసినట్లు తెలిపింది.
ఈ సినిమా కూడా బాగా డిలే అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్నట్లు నిధి అగర్వాల్ ఒకే ఏడాది రెండు పెద్ద ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరమల్లు ఈ నెల 24 న రిలీజ్ అవుతుండగా, రాజాసాబ్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. హిట్ అయితే గనుక నిధి రాత మారిపోవాలి. ఇప్పటికే సక్సెస్ ఆలస్యమైన నేపథ్యంలో సాలిడ్ సక్సెస్ తో సత్తా చాటాలని అమ్మడు ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది.
