పవన్ రాకపోవడం నిధికి కలిసొస్తుందా!
`హరిహరవీరమల్లు` ప్రచారం పనులు మొదలైన సంగతి తెలిసిందే. జూన్ 12న పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఉన్న సమయాన్ని టీమ్ అంతా ప్రచారానికే కేటాయిస్తుంది.
By: Tupaki Desk | 30 May 2025 1:20 PM IST`హరిహరవీరమల్లు` ప్రచారం పనులు మొదలైన సంగతి తెలిసిందే. జూన్ 12న పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఉన్న సమయాన్ని టీమ్ అంతా ప్రచారానికే కేటాయిస్తుంది. అయితే ఈ ప్రచారం పనులన్నింటిలోనూ పవన్ పాల్గొనలేకపోతున్నారు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేక పోతున్నారు. ముంబైలో జరిగే ప్రెస్ మీట్తో పాటు మరో రెండు భారీ ఈవెంట్లకు మాత్రమే పీకే హాజరయ్యే అవకాశం ఉంది.
అప్పటి వరకూ దర్శకు, నిర్మాత, హీరోయిన్, ఇతర నటీనటులతో ప్రచారం పనులు ముందుకు తీసుకె ళ్లాల్సిందే. దీనిలో భాగంగా హీరోయిన్ గా నటిస్తోన్న నిధి అగర్వాల్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వడం లేదు. ప్రచారం పరంగా యూనిట్ కి అన్ని రకాలుగా మద్దతిస్తుంది. దర్శ, నిర్మాతల ఆదేశాల మేరకు నడుచు కుంటుంది. ఇది నిధి అగర్వాల్ కు వ్యక్తిగతంగానూ కలిసొస్తుంది. మీడియా సమావేశాల్లో ప్రధానంగా ఆమె హైలైట్ అవుతుంది.
అదే పవన్ కళ్యాణ్ కూడా హాజరై ఉంటే నిధి ఫోకస్ అయ్యేది కాదు. కెమెరాలన్నీ పవన్ పై నే ఉంటాయి. స్పాట్ లో ఉన్నంత సేపు ఆయన మీదనే మీడియా ఫోకస్ ఉంటుంది. కానీ ఆయన లేకపోవడంతో ఆ ఫోకస్ అంతా నిధి అగర్వాల్ పై మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో నిధి తనను తాను వ్యక్తిగతంగానూ ప్రమోట్ చేసుకుంది. అసలే అమ్మడికి సరైన పీఆర్ లేరు. అన్ని తానై పనిచేసుకోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలో అన్ని ఉన్నా? అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం సరైన పీఆర్ లేకపోవడం కూడా చెప్పాలి. సోషల్ మీడియలో కూడా రేర్ గానే యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు వీరమల్లు ప్రచారంలో భాగంగా నిధి అగర్వాల్ ఎక్కువగా హైలైట్ అవుతుంది. వృత్తి..వ్యక్తిగతంగా తన మార్క్ వేసే ప్రయత్నం చేస్తుంది.
