Begin typing your search above and press return to search.

నిధి కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

అందానికి అందం ఉండి ఆల్రెడీ ఆడియన్స్ మనసు గెలిచినా కూడా కెరీర్ విషయంలో నిధి అగర్వాల్ వెనుకబడి ఉంది.

By:  Tupaki Desk   |   9 May 2025 8:45 AM IST
Nidhhi Agerwal Aims to Reclaim Tollywood Spotlight
X

అందానికి అందం ఉండి ఆల్రెడీ ఆడియన్స్ మనసు గెలిచినా కూడా కెరీర్ విషయంలో నిధి అగర్వాల్ వెనుకబడి ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ అంతకుముందు మిస్టర్ మజ్ను, సవ్యసాచి చేసినా రాని పాపులారిటీ ఒక్క ఇస్మార్ట్ శంకర్ తో తెచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత కూడా కెరీర్ ఒక రేంజ్ లో దూసుకెళ్తుందని అనుకోగా ఆశించిన స్థాయిలో వెళ్లలేదు. ముఖ్యంగా అమ్మడు తీసుకుంటున్న గ్యాప్ ఆడియన్స్ నుంచి ఆమెను దూరం చేస్తుంది.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత 2022 లో అంటే 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని గల్లా అశోక్ తో హీరో సినిమా చేసింది నిధి అగర్వాల్. ఆ గ్యాప్ లో తమిళ్ లో ఈశ్వరన్, భూమి సినిమాలు చేసింది. కోలీవుడ్ లో ఈశ్వరన్ హిట్ అందుకోగా అమ్మడి కోసం అక్కడ గుడి కూడా కట్టే రేంజ్ కి వెళ్లింది. అంతేకాదు నిధి కి అక్కడ అభిమాన సంఘాలు ఏర్పడి ఆమె పుట్టినరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.

తెలుగు విషయానికి వస్తే మళ్లీ 3 ఏళ్ల తర్వాత హరి హర వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో వస్తుంది నిధి అగర్వాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వీరమల్లు సినిమా గత 4 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఐతే ఈమధ్యనే ఆ సినిమా మొదటి భాగానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారట. జూన్ రెండో వారం రిలీజ్ ఉంటుందని టాక్. ఈ సినిమాలో నిధి హీరోయిన్ గా నటిస్తుంది. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అంటే అది మాములు విషయం కాదు.

మరోపక్క రాజా సాబ్ లో కూడా నిధి సర్ ప్రైజ్ చేస్తుంది. ఆఫ్టర్ గ్యాప్ నిధి ఈ రెండు సినిమాలతో మళ్లీ తన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయాలని చూస్తుంది. నిధి ఫ్యాన్స్ కూడా అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు. రాబోతున్న రెండు సినిమాల్లో నిధి ఖాతాలో ఏ ఒక్కటి హిట్ పడినా టాలీవుడ్ లో అమ్మడు మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలుగులో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హంగామా నడుస్తుండగా నిధి కూడా అలాంటి ఒక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ మెటీరియల్ అయిన నిధి ఇలా సైలెంట్ అవ్వడం ఆమె ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. అందుకే అమ్మడు కెరీర్ లో దూకుడు చూపిస్తే ఆమెకు సపోర్ట్ గా ఉండాలని చూస్తున్నారు.