Begin typing your search above and press return to search.

నా కోరిక కోసం ఆ ప‌నులు అస్స‌లు చేయ‌ను

ఎవ‌రు చెప్పినా, ఎంత ప్రెజ‌ర్ ఉన్నా తాను చేయ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయ‌ని నిధి అగ‌ర్వాల్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   21 July 2025 7:00 PM IST
నా కోరిక కోసం ఆ ప‌నులు అస్స‌లు చేయ‌ను
X

కొంత‌మంది హీరోయిన్లు సినిమా కోసం ఏం చేయడానికైనా సై అంటారు. కానీ కొంద‌రు మాత్రం ఎలాంటి పాత్ర‌లు చేయాలి? ఎంత‌వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ చేయొచ్చు? ఎక్స్‌పోజింగ్ ఎంత వ‌ర‌కు చేయొచ్చనే విష‌యంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా త‌న పాత్ర విష‌యంలో, ఎక్స్‌పోజింగ్ విష‌యంలో కొన్ని రూల్స్ ఉన్నాయంటున్నారు.

ఎవ‌రు చెప్పినా, ఎంత ప్రెజ‌ర్ ఉన్నా తాను చేయ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయ‌ని నిధి అగ‌ర్వాల్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌స్తోన్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించారు. ఏఎం జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న వీర‌మ‌ల్లు జులై 24న రిలీజ్ కానుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్స్ లో నిధి అగ‌ర్వాల్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

ఈ సినిమా కోసం ఐదేళ్ల పాటూ క‌ష్ట‌ప‌డిన నిధి అగ‌ర్వాల్ వీర‌మ‌ల్లులో పంచ‌మి పాత్ర కోసం భ‌ర‌త నాట్యం, గుర్ర‌పు స్వారీలో స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. సినిమాలోకి కీల‌క స‌న్నివేశం భ‌ర‌త‌నాట్యం నేప‌థ్యంలో ఉంటుంద‌ని, వీర‌మ‌ల్లులో త‌న క్యారెక్ట‌ర్‌కు ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ కూడా ఉంద‌ని చెప్పిన నిధి, త‌న‌కు మాస్ హీరోయిన్ అవాల‌ని కోరిక‌గా ఉంద‌ని తెలిపారు.

మాస్ ఇమేజ్ రావాలంటే బికినీ, లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి ఉంటుంది క‌దా అని యాంక‌ర్ అడ‌గ్గా, దానికి నిధి చాలా సింపుల్ గా, స్ట్రాంగ్ గా స‌మాధానమిచ్చారు. అలాంటివ‌న్నీ తాను చేయ‌న‌ని, త‌న లిమిట్స్ త‌న‌కు తెలుసుని, త‌న పేరేంట్స్ తో క‌లిసి చూడ‌లేని సీన్స్ లో తాను న‌టించ‌న‌ని, అలాంటి సీన్స్ చేయ‌క‌పోయినా మాస్ హీరోయిన్ అవొచ్చ‌ని, మంచి క‌థ‌ల‌ను ఎంచుకుని క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని నిధి పేర్కొన్నారు.