ఐదున్నరేళ్ల క్రితం నిధి ఇప్పటికీ అలాగే!
వయసు కూడా పెరుగతుంది కాబట్టి శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. కానీ ఈ విషయంలో నిధి అగర్వాల్ కు కీరవాణి అభిమానిగా మారిపోయారు.
By: Tupaki Desk | 22 May 2025 11:50 AM ISTఫిట్ నెస్ ని కాపాడుకోవడం...బ్యూటీని మెయింటెన్ చేయడం అన్నది అన్నివేళలా సాధ్యం కాదు. కొన్ని సార్లు పాత్రల కోసం బరువు తగ్గాల్సి ఉంటుంది. పెరగాల్సి ఉంటుంది. లుక్ పరంగా చాలా మార్పులు తీసుకు రావాల్సి ఉంటుంది. ఇదంతా ఆయా సినిమాల మీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడు ఎలా చెబితే అలా మౌల్డ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎంత ఫిట్ నెస్ ప్రియురళ్లు అయినా ఐదారేళ్లు అయ్యే సరికి శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తుంటాయి.
వయసు కూడా పెరుగతుంది కాబట్టి శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. కానీ ఈ విషయంలో నిధి అగర్వాల్ కు కీరవాణి అభిమానిగా మారిపోయారు. ఆమె లో బ్యూటీ పొగడకుండా ఉండలేకపోయారు? `హరి హరవీరమల్లు` చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఐదేళ్లక్రితం ఈ సినిమా ప్రారంభమైంది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో ఆ సినిమాకు పనిచేసిన చాలా మందిలో మార్పులొచ్చాయి. కానీ నిధి అగర్వాల్ లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదన్నారు కీరవాణి. ఐదున్నరేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని పొగిడేసారు. సినిమాలోని కొల్లగొట్టినాదిరో పాట దేళ్ల క్రితం చిత్రీకరించాం. ఆ పాటలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. కథానాయికగా అలా కనిపించడం అన్నది చాలా కష్టమైన పనిగా పేర్కొన్నారు.
నిధి అగర్వాల్ మంచి ఫిట్ నెస్ ప్రియురాలు. డైట్ విషయంలో ఎంతో పర్పెక్ట్. పూర్తిగా వెజ్ ప్రియురాలు. క్రమం తప్పకుండా జిమ్..యోగా చేస్తుంది. ప్రస్తుతం అమ్మడి వయసు 31. 22 ఏళ్లకే ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. అప్పటికీ ..ఇప్పటికీ అమ్మడి రూపలావణ్యంలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇప్పటికీ 20 ఏళ్ల నవ నాయికలా మురిపిస్తుంది.
