Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎల్లోరా శిల్పాన్ని తలపించే అందాల నిధి

సినిమాలతో బిజీగా లేకున్నా కూడా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటున్న నిధి అగర్వాల్‌ తాజా ఫోటో షూట్స్ తో అదరగొట్టింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 3:59 AM GMT
పిక్ టాక్ : ఎల్లోరా శిల్పాన్ని తలపించే అందాల నిధి
X

టాలీవుడ్ లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రంతో హీరోయిన్‌ గా అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. తెలుగు లో ఈ అమ్మడు ఆ వెంటనే అఖిల్ కి జోడీగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మొదటి రెండు సినిమాలు కూడా నిరాశ పర్చడంతో టాలీవుడ్‌ లో ఈమె కష్టమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.


మొదటి రెండు సినిమాలు నిరాశ పరిచినా కూడా పూరి జగన్నాధ్ నుండి ఇస్మార్ట్‌ శంకర్ సినిమా కోసం పిలుపు దక్కింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా సక్సెస్ ను నిధి అగర్వాల్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లో విఫలం అయింది.

ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేయకున్నా కూడా పవన్‌ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా లో నటిస్తున్న కారణంగా కెరీర్‌ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా విడుదల తర్వాత కచ్చితంగా నిధి అగర్వాల్ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

సినిమాలతో బిజీగా లేకున్నా కూడా ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటున్న నిధి అగర్వాల్‌ తాజా ఫోటో షూట్స్ తో అదరగొట్టింది. ఎల్లోరా శిల్పం ఇలాగే ఉంటుందా అన్నట్టు ఫోజ్ ఇవ్వడంతో పాటు థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేసి, క్లీ వేజ్ షో చేసింది. ఈ రేంజ్ అందాల ఆరబోత మరియు ఆ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్ అన్నింటికి కూడా ఆహా అనాల్సిందే.