Begin typing your search above and press return to search.

నిక్ జోనాస్‌తో ప్రేమలో ప‌డిన ప్ర‌ముఖ గాయ‌ని

అమెరిక‌న్ పాప్ గాయ‌కుడు నిక్ జోనాస్ ప్ర‌స్తుతం భార‌తీయ న‌టి, మాజీ ప్ర‌పంచ సుంద‌రి ప్రియాంక చోప్రా భ‌ర్త‌.

By:  Tupaki Desk   |   8 Jun 2025 8:00 AM IST
నిక్ జోనాస్‌తో ప్రేమలో ప‌డిన ప్ర‌ముఖ గాయ‌ని
X

అమెరిక‌న్ పాప్ గాయ‌కుడు నిక్ జోనాస్ ప్ర‌స్తుతం భార‌తీయ న‌టి, మాజీ ప్ర‌పంచ సుంద‌రి ప్రియాంక చోప్రా భ‌ర్త‌. ఈ జంట‌కు మాల్తీ మేరీ అనే కుమార్తె కూడా ఉంది. వీరి అన్యోన్య దాంప‌త్యం జంట‌ల‌కు స్ఫూర్తి. జోనాస్ కుటుంబ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌రిస్తూనే, న‌ట‌న‌లో కెరీర్ ని విజ‌య‌వంతంగా సాగిస్తోంది ప్రియాంక చోప్రా. ఈ ముంబై భామ ప్ర‌స్తుతం మ‌హేష్- రాజ‌మౌళి పాన్ ఇండియా సినిమాలోను న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోనాస్ తో 20ఏళ్ల నాటి డేటింగ్ రోజుల్ని గుర్తు చేసుకుంది ప్ర‌ముఖ పాప్ గాయ‌ని మిలీ సైర‌స్. అత‌డంటే ఇప్ప‌టికీ ప్రేమ ఉంద‌ని, నిక్ నేమ్ `నైలీ`ని కూడా ప్ర‌స్థావించింది. మిలీ సైరస్ - నిక్ జోనాస్ విడిపోయి దాదాపు రెండు దశాబ్దాలు అయింది. ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా ఎవ‌రికి వారు చాలా దూరం ప్ర‌యాణించారు. ప్ర‌స్తుతం మిలీ సంగీతకారుడు మాక్స్ మొరాండోతో డేటింగ్‌లో ఉంది.

అయినా ఇప్ప‌టికీ నిక్ జోనాస్ ని ప్రేమిస్తున్నాన‌ని మిలీసైర‌స్ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఎవ్రీ సింగిల్ ఆల్బమ్ పాడ్‌కాస్ట్‌లో కనిపించిన మైలీ ``నాకు నిక్ అంటే ఇష్టం.. చాలా ఇష్టపడుతున్నాను`` అని నిజాయితీగా అంగీకరించింది. నిక్ జోనాస్ ప్రస్తుత కుటుంబం గురించి వ్యాఖ్యానిస్తూ, అత‌డు పిల్ల‌ల‌తో హాయిగా ఉన్నాడు.. అని అంది.

నిక్ జోనాస్ - మైలీ సైరస్ 2006లో మొదటిసారి ఒకరినొకరు కలుసుకున్నారు. త‌ర్వాత డేటింగ్ చేసారు. కానీ ఆ త‌ర్వాత విడిపోయారు. ఈ బ్రేక‌ప్ త‌ర్వాత తాను చాలా ఏడ్చాన‌ని మిలీ సైర‌స్ తెలిపారు. క‌లిసుందామ‌ని ప్రాధేయ‌ప‌డిన‌ట్టు తెలిపింది. కానీ డిస్నీలో కెరీర్ కోసం ప్ర‌య‌త్నంలో నిక్ జోనాస్ త‌న‌ను దూరం పెట్టాడ‌ని కూడా మిలీ నిజాయితీగా చెప్పింది. ఇక అత‌డిపై విర‌హంతో ఏకంగా ఒక సింగిల్ సాంగ్ నే రాసింది మిలీ. `కాంట్ బి టేమ్డ్ ఆల్బమ్ నుండి నిక్ - టేక్ మీ అలాంగ్‌`లో త‌మ మ‌ధ్య రిలేష‌న్ షిప్ ని ఆవిష్క‌రించింది.