Begin typing your search above and press return to search.

వ‌ర‌ల‌క్ష్మికి కాబోయే వ‌రుడి సీక్రెట్స్ లీక్

అత‌డి పేరు నికోల‌య్ స‌చ్‌దేవ్‌. ముంబైకు చెందిన ప్ర‌ముఖ బిజినెస్‌మేన్‌. త‌ను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు

By:  Tupaki Desk   |   3 March 2024 9:12 AM GMT
వ‌ర‌ల‌క్ష్మికి కాబోయే వ‌రుడి సీక్రెట్స్ లీక్
X

క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలు శ్రుతిహాస‌న్ స‌డెన్ గా త‌న బోయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారికాను ప‌రిచ‌యం చేయ‌గానే చాలా మంది అభిమానులు క‌న్ఫ్యూజ్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అత‌డు ఎవ‌రు? ఏం చేస్తాడు? అంటూ ఆరాలు తీసారు. అయితే శంత‌ను డూడుల్ ఆర్టిస్టు అని తెలిసింది. శ్రుతి కూడా మంచి పెయింట‌ర్ కం ఆర్టిస్టు గ‌నుక అత‌డితో సులువుగా ప్రేమ‌లో ప‌డింది. అత‌డి ఆర్ట్ కొన్ని కోట్ల విలువ చేసే వ్యాపారానికి కేంద్రంగా ఉంది. అందుకే అత‌డితో శ్రుతి ప్రేమ‌లో ప‌డిపోయింది. ఇద్ద‌రి మ‌నసులు క‌లిసాయి.. క‌ల‌సి జీవ‌నం సాగిస్తున్నారు.

అదంతా అటుంచితే.. వ‌న్ ఫైన్ డే ఆక‌స్మికంగా త‌న‌కు స్నేహితుడితో నిశ్చితార్థ‌మైంద‌ని న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప్ర‌క‌టించ‌గానే అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడు కూడా వ‌రూకి కాబోయే వ‌రుడి వివ‌రాలేమిట‌న్న ఆరాలు మొద‌ల‌య్యాయి. శ‌ర‌త్ కుమార్ కి కాబోయే అల్లుడి వివ‌రాల గురించి అభిమానులు చాలా తెలుసుకోవాల‌నుకుంటున్నారు. అస‌లింత‌కీ ఎవ‌రు అత‌డు? అంటే...

అత‌డి పేరు నికోల‌య్ స‌చ్‌దేవ్‌. ముంబైకు చెందిన ప్ర‌ముఖ బిజినెస్‌మేన్‌. త‌ను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు. నికోల‌య్ స‌చ్‌దేవ్ ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. అత‌డు ప్రముఖ దక్షిణ భారత నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వార్తల్లో నిలిచారు. వీరి నిశ్చితార్థ వేడుక ముంబయిలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం జరుగుతుందని ఈ జంట ప్రకటించారు.

న‌టి వరలక్ష్మికి అతనికి గ‌త ప‌ద్నాలుగేళ్లుగా ప‌రిచ‌యం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మ‌చారం. ప్రస్తుతం వీరిద్ద‌రూ త‌మ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో బిజిగా ఉండ‌డంతో వ‌చ్చే సంవ‌త్స‌రం వివాహం జరిగే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

నికోలాయ్ సచ్‌దేవ్ కి బాలీవుడ్ లో మంచి ప‌రిచ‌యాలున్నాయి. అతడికి జాన్ అబ్రహం, సుస్మితా సేన్ స‌హా ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు. నికోలాయ్ పచ్చబొట్టు ప్రేమికుడు. అత‌డి శ‌రీరం నిండా టాట్టూలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అత‌డు బాడీబిల్డింగ్ లోను శ్ర‌ద్ధ‌గా ఉంటాడ‌ని అత‌డి ఆకృతి చెబుతోంది.