Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి కొత్త విల‌న్..బాల‌య్య ఛాన్స్!

ఇలాంటి వారిని చూసి రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డం విశేషం. తాజాగా శివాజీ కూడా విల‌న్ అవుతానంటోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:42 AM GMT
టాలీవుడ్ కి కొత్త విల‌న్..బాల‌య్య ఛాన్స్!
X

టాలీవుడ్ లో విల‌న్ పాత్ర‌లంటే ఇప్పుడు ఎక్క‌డ నుంచి ప‌ట్టుకురావాల్సిన ప‌నిలేదు. సొంత భాష‌లోనే కావాల్సినంత మంది విల‌న్లు ఉన్నారు. రోజు రోజుకి కొత్త విల‌న్లు పుట్టుకొస్తున్నారు. సినిమా ట్రెండ్ మార డంతో ఒక‌ప్ప‌టి హీరోలే విల‌న్లు అవుతున్నారు. జ‌గ‌ప‌తిబాబు..శ్రీకాంత్ లాంటి వారు ఇప్ప‌టికే విల‌న్లుగానూ ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా పెర్పార్మెన్స్ లో నేచురాలిటీ కావాల‌నుకుంటే త‌మిళ న‌టుల్నో..మ‌ల‌యాళం న‌టుల్నో రంగంలోకి దించుతున్నారు త‌ప్ప వెంట‌నే బాలీవుడ్ కి మాత్రం ప‌రుగు తీయ‌డం లేదు.

ఇలాంటి వారిని చూసి రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డం విశేషం. తాజాగా శివాజీ కూడా విల‌న్ అవుతానంటోన్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలం పాటు హీరో పాత్ర‌లు..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శివాజీ అటుపై సినిమాల‌కు దూర‌మయ్యాడు. మ‌ధ్య‌లో రాజ‌కీయాలు చేసాడు. కానీ అక్క‌డ నిల‌బ‌డ‌లేదు. మ‌ళ్లీ సినిమాలంటూ మ్యాక‌ప్ వేసుకుంటున్నాడు. ఈసారి త‌న ఫ్యామిలీ కోసం మ్యాక‌ప్ వేసుకుంటున్న‌ట్లు తెలిపాడు.

శివాజీని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ప్రోత్స‌హిస్తూ త‌న సినిమాలో విల‌న్ గా న‌టించే అవ‌కాశం క‌ల్పించి న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. బోయ‌పాటి త‌దుప‌రి సినిమా న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తో చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యలో బోయ‌పాటి ఆఫ‌ర్ ఇచ్చింది బాల‌య్య సినిమాలోనా? లేక మ‌రో చిత్రంలోనా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ..శివాజీ మాత్రం విల‌న్ గా రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. న‌టుడిగా శివాజీ విల‌న్ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల న‌టుడే.

కానీ ఆహార్యం ప‌రంగా..క‌టౌట్ ప‌రంగా చూస్తే విల‌న్ పాత్ర‌కు ప‌నికొస్తాడా? అన్న‌ది సందేహ‌మే. అందు లోనూ బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ సినిమాలో విల‌న్ అంటే? బోలెడంత హంగామా ఉంటుంది. హీరో ని మించి విల‌న్ పాత్ర‌ను ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తాడు బోయ‌పాటి. అందుకోసం బోయ‌పాటి ప్ర‌త్యేక‌మైన వ‌ర్క్ చేస్తుంటాడు. మ‌రి శివాజీ లాంటి న‌టుడ్ని విల‌న్ గా తీర్చిదిద్దాలంటే? బోయ‌పాటి మ‌రింత హార్డ్ వ‌ర్క్ త‌ప్ప‌దు. ముందు ఈ ప్ర‌చారంలో నిజమెంతో తెలియాలి.