Begin typing your search above and press return to search.

కొత్త సినిమాలు.. నెగెటివిటీని జయిస్తాయా?

కానీ తర్వాతి కాలంలో హార్రర్ కామెడీలంటే ప్రేక్షకులు బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది.

By:  Tupaki Desk   |   11 April 2024 6:23 AM GMT
కొత్త సినిమాలు.. నెగెటివిటీని జయిస్తాయా?
X

మరో వీకెండ్‌కు బాక్సాఫీస్ సిద్ధమైంది. ఈ వారం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా అంటే.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’నే. గురువారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిందీలో ఇప్పటికే ‘మైదాన్’ రిలీజ్ కాగా.. గురువారం ‘బడేమియా చోటేమియా’ విడుదలవుతోంది. ‘మైదాన్’ మూవీకి ఉన్నంతలో పాజిటివ్ టాకే వచ్చింది. మరి గురువారం సినిమాల సంగతేంటో చూడాలి. గీతాంజలి, బడేమియా చోటేమియా సినిమాలు రెంటికీ విడుదలకు ముందు ఆశించినంత బజ్ లేదు. ఒక రకమైన నెగెటివిటీ ఈ చిత్రాలను ముసురుకుంది. ముందుగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ విషయానికి వస్తే దశాబ్దం కిందట వచ్చిన హార్రర్ కామెడీ మూవీకి ఇది సీక్వెల్. ఐతే ‘గీతాంజలి’ వచ్చిన టైంకే జనాలకు హార్రర్ కామెడీ జానర్ అంటే మొహం మొత్తేసింది. ఆ సినిమా అప్పటికి ఏదోలా ఆడేసింది.

కానీ తర్వాతి కాలంలో హార్రర్ కామెడీలంటే ప్రేక్షకులు బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది. ఆ జానర్ పూర్తిగా ఔట్ డేటెడ్ అయిపోయి ఇందులో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టడం మొదలైంది. దీంతో ఈ జానర్‌ను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ మధ్యే ‘ఊరు పేరు భైరవకోన’, ‘ఓం భీం బుష్’ చిత్రాల్లో ఈ జానర్‌ను మళ్లీ టచ్ చేశారు. అంతగా వర్కవుట్ కాలేదు. ఇక ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చూస్తే సాధారణంగా కనిపించింది. అందుకే రిలీజ్ ముంగిట సినిమాకు బజ్ రాలేదు. కానీ ఈ సినిమా రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ మాత్రం ‘గీతాంజలి’ మళ్లీ మ్యాజిక్ చేస్తుందని ధీమాగా ఉన్నారు. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి రూపొందించాడు. ఇక ‘బడేమియా చోటేమియా’ విషయానికి వస్తే.. ఇదొక సగటు యాక్షన్ సినిమాల టెంప్లేట్‌లో కనిపించడం, ట్రైలర్ ఆసక్తికరంగా లేకపోవడంతో హైప్ క్రియేట్ కాలేదు. అక్షయ్ కుమార్ గత సినిమాల ఫెయిల్యూర్ల ప్రభావం కూడా దీని మీద పడింది. మరి ఈ నెగెటివిటీని దాటి ఈ భారీ చిత్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.