Begin typing your search above and press return to search.

ఈ కొత్త స‌ర్ ప్రైజ్ లు ఏంటి జ‌గ్గుభాయ్‌?

వైట్ హాఫ్ హ్యాండ్స్ ష‌ర్ట్.. కాట‌న్ జీన్స్..క‌ళ్ల‌కి గ్లాసెస్ ధ‌రించిన న్యూ ఫోటో షూట్ ని నెట్టంట షేర్ చేసాడు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 6:51 AM GMT
ఈ కొత్త స‌ర్ ప్రైజ్ లు ఏంటి జ‌గ్గుభాయ్‌?
X

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుల్లో జ‌గ‌ప‌తి బాబు మంచి పిట్ నెస్ ప్రియుడు. దైనందిన జీవితంలో జిమ్..యోగా లాంటివి త‌ప్ప‌నిస‌రి అంటారు. అందుకే 60 ఏళ్లు దాటినా న‌వ నాయకుడిలా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నారు. ఫిట్ గా... బాడీని మంచి షేప్ లో ప్రొజ‌క్ట్ చేస్తుంటారు. కొంత కాలంగా నెరిసిన హెయిర్ స్టైల్..గెడ్డంతో టాలీవుడ్ కి త‌న‌లో న్యూ లుక్ ని ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.

అంత‌కు ముందు ఇదే లుక్ ని త‌ల అజిత్ మెయింటెన్ చేసేవాడు. అత‌డికిది ప‌ర్పెక్ట్ గా సూట‌యింది. అదే లుక్ లో జ‌గ్గుబాయ్ ఆక‌ట్టుకుంటున్నారు. ఇత‌నికీ బాగా సెట్ అయింది. ఈ లుక్ పై మంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

తాజాగా జ‌గ‌ప‌తి బాబు శ‌రీర సౌష్ట‌వంలో భారీ మార్పులు తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రింత ఫిట్ క‌నిపిస్తున్నారు. వైట్ హాఫ్ హ్యాండ్స్ ష‌ర్ట్.. కాట‌న్ జీన్స్..క‌ళ్ల‌కి గ్లాసెస్ ధ‌రించిన న్యూ ఫోటో షూట్ ని నెట్టంట షేర్ చేసాడు.

అలాగే ముఖాన్ని మ‌రింత ప్ర‌కాశ వంత‌గా మ‌లిచేందుకు అందుకు త‌గ్గ‌ట్టు మ్యాక‌ప్‌ వేసుకుని దానిపై టిష్యూ పేపేరు అంటిచారు. ఆ ఫోటోని సోష‌ల మీడియాలో షేర్ చేసాడు. ఇంత‌కు ముందు పింక్ డ్రెస్ లో చూసి అంతా నన్ను కుర్రాడు అనుకున్నారు. అందుకే యెచ్చులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నిజంగానే కుర్రాడిని అయిపోదామ‌ని నాముఖాన్ని రెడీ చేస్తున్నా అన్నారు. ఇది చూసిన అభిమానులు మీరు ఇప్ప‌టికీ కుర్రాడిలాగే ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక జ‌గ‌ప‌తి బాబు కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. విల‌న్ పాత్ర ఆఫ‌ర్ చేస్తే ఆ ర‌కంగా త‌నేం త‌క్కువ కాద‌ని అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి నిరూపిస్తున్నారు. స్టైలిష్ విల‌న్ గా బాగా ఫోక‌స్ అవుతున్నారు. ఆ ర‌కంగా కొంత మంది బాలీవుడ న‌టుల‌కు జ‌గ‌ప‌తి బాబు అడ్డ‌క‌ట్ట వేయ‌గ‌లిగారు. అలాగే స‌హ‌న‌టుడిగా భిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తున్నారు.