Begin typing your search above and press return to search.

విరూపాక్ష 2 లో మరో హీరో..?

అంతేకాదు విరూపాక్ష 2 లో సాయి ధరం తేజ్ తో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని టాక్. విరూపాక్ష సీరీస్ ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ కార్తీక్.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:30 AM GMT
విరూపాక్ష 2 లో మరో హీరో..?
X

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన కార్తీక్ దండు విరూపాక్ష సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. అంతకుముందు తన దర్శకత్వంలో భమ్ బోలేనాథ్ సినిమా చేసిన కార్తీక్ ఆ సినిమా తర్వాత సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాడు. విరూపాక్ష సినిమా హిట్ అతని కెరీర్ స్వింగ్ లోకి తెచ్చింది. నిర్మాతలంతా కూడా కార్తీక్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విరూపాక్ష తర్వాత విరూపాక్ష 2 ఉంటుందని అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

విరూపాక్ష 2 తో ఆడియన్స్ ని మరింత ఎక్కువ భయపెట్టే కాన్సెప్ట్ లు ఆలోచిస్తున్నారట. అయితే విరూపాక్ష సినిమా చివర్లో సాయి తేజ్ తో ఒక చిన్న హింట్ ఇచ్చిన డైరెక్టర్ విరూపాక్ష 2 లో అది కొనసాగిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు విరూపాక్ష 2 లో సాయి ధరం తేజ్ తో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని టాక్. విరూపాక్ష సీరీస్ ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ కార్తీక్. అందుకే విరూపాక్ష 2 తోనే సినిమా ముగించకుండా దానికి కొనసాగింపుగా విరూపాక్ష 3 కూడా ప్లానింగ్ లో ఉందట.

ఈమధ్య సినిమాలకు ఫ్రాంచైజ్ లాగా తీసుకుంటూ వెళ్లడం కామన్ అయ్యింది. ఆల్రెడీ హిట్ అంటూ శైలేష్ ఒక ప్రయత్నం చేస్తున్నాడు. హిట్ 1 విశ్వక్ సేన్ తో.. హిట్ 2 అడివి శేష్ తో చేయగా హిట్ 3ని నానితో ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో విరూపాక్ష సాయి తేజ్ తో తెరకెక్కించగా విరూపాక్ష 2 లో అతను విలన్ గా మారి మరో హీరో ఎంట్రీ ఇస్తాడట. ఆ తర్వాత విరూపాక్ష 3 లో మరో స్టార్ ఇలా వరుసగా ఎంట్రీ ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా విరూపాక్ష సీరీస్ లను కొనసాగించడం మాత్రం హారర్ జానర్ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

సుకుమార్ చెప్పిన మార్పులతో విరూపాక్ష సినిమా చేశాడు డైరెక్టర్ కార్తీక్. అందుకే సుకుమార్ రైటింగ్స్ కూడా విరూపాక్ష లో నిర్మాణ భాగస్వామ్యం అయ్యింది. ఇక రాబోతున్న సినిమాలకు కూడా సుకుమార్ తన సపోర్ట్ అందిస్తారని చెప్పొచ్చు. విరూపాక్ష 2 గురించి అప్డేట్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష 2 బడ్జెట్ విషయంలో కూడా ఈసారి నో కాంప్రమైజ్ అనేలా మేకర్స్ క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది.