Begin typing your search above and press return to search.

కొత్తొక వింత‌...పాతొక రొధ‌!

గ‌త ఆరేడేళ్ల కాలంలో ఈ మార్పు ఇండ‌స్ట్రీలో బాగా క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   10 April 2024 12:30 PM GMT
కొత్తొక వింత‌...పాతొక రొధ‌!
X

కొత్తొక వింత‌..పాతొక రోధ‌! అన్న దానికి ఇండ‌స్ట్రీ నుంచి ఇప్పుడు స‌రైన స‌మాధానం దొరికిన‌ట్లు చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇప్పుడెంత‌లా ఛేంజ్ అయిందో తెలిసిందే. న‌వ‌త‌రం ర‌చ‌యిత‌లు కొత్త జాన‌ర్ క‌థ‌ల్ని తెర‌పైకి తెస్తున్నారు. ఇన్నో వేటివ్ ఐడియాల‌కు నిర్మాత‌లు సైతం పెద్ద పీట వేస్తున్నారు. హీరో క‌టౌట్ కంటే కంటెంట్ ఉన్న క‌థ‌ల్నే ఆద‌రిస్తున్నారు? అన్న‌ది నిర్మాత‌లు బ‌లంగా విశ్వ‌శిస్తున్నారు. కొత్త‌గా ప్రేక్ష‌కుల‌కు ఏం చూపించ‌గ‌లం అన్న అంశంపై న‌వ‌త‌రం ర‌చ‌యిత‌లు ప‌ని చేస్తున్నారు. సాహిత్యం..సంగీతం విష‌యంలో సైతం ఈ మార్పు మునుప‌టి కంటే మ‌రింత మెరుగ్గా ఉందనిపిస్తుంది.

గ‌త ఆరేడేళ్ల కాలంలో ఈ మార్పు ఇండ‌స్ట్రీలో బాగా క‌నిపిస్తుంది. ఒక‌ప్ప‌టి తెలుగు సినిమా జాన‌ర్ అంటే యాక్ష‌న్ -సెంటిమెంట్-నాలుగు ఫైట్లు..ఆరుపాట‌ల‌తో రెండున్న‌ర గంట‌ల ఎంట‌ర్ టైన్ ఉండేది. తీసిన జాన‌ర్ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ తీసేవారు. హీరో ఎలివేష‌న్లు...హీరోయిన్ అందాలు...ఐటం గాళ్ల్ బ్యూటీతోనే మూడు ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీ సాగిపోయింది. అయితే ఇప్పుడందుకు పూర్తి భిన్నంగా ప‌రిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ర‌చ‌యిత‌లే హీరోల‌వుతున్నారు.

త‌మ‌ని త‌మే స్టార్ల‌గా మార్చుకునే స్ట్రాట‌జీతో ఇండ‌స్ట్రీలో ముందుకు క‌దులుతున్నారు. అడ‌విశేషు...సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ..రిష‌బ్ శెట్టి... లాంటి వారు ఈ విష‌యంలో ఔత్సాహికుల్లో స్పూర్తిని నింపుతున్నారు. క్రియేటివ్ గా వెళ్ల‌గ‌లిగితే ఇప్పుడు అవ‌కాశాల‌కు అన్నీ గేట్లు తెరిచి ఉన్నాయ‌ని నిరూపించిన వారు. ఇలాంటి ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హించ‌డానికి ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తున్నారు. థియేట‌ర్ కొచ్చిన ఆడియ‌న్స్ అంతా బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూడ‌కుండా సినిమాని ఆద‌రిస్తున్నారు.

ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయ‌గ‌ల సామర్ధ్యం...స‌త్తా ఉంటే? హీరో ఇమేజ్ తో ప‌నిలేద‌ని చాటుతున్నారు. ఇటీవ‌లే `మంజ‌మ్మ‌ల్ బోయ్స్` అనే మ‌ల‌యాళం సినిమా తెలుగులో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో న‌టీన‌టులు ఎవ‌రూ తెలుగు ఆడియ‌న్స్ కి తెలియ‌దు. కానీ కేవ‌లం కంటెంట్ తోనే ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్లో కూర్చోబెట్టారు. థియేట‌ర్లో ఉన్నంత సేపు సినిమాని ఆస్వాదించారు త‌ప్ప! ఆ న‌టుడు ఎవ‌రు? అన్న థాట్ కూడా మైండ్ లోకి రాలేదు.

`డీజేటిల్లు` తో ఫేమ‌స్ అయిన సిద్దు జొన్న‌ల గ‌డ్డ కూడా కేవ‌లం త‌న క్యారెక్ట‌రైజేష‌న్...ఆ మ్యాన‌రిజంతోనే మెప్పించాడు. అడ‌వి శేషుది ఇండ‌స్ట్రీలో సుదీర్గ ప్ర‌స్థానం. అత‌డు స‌క్సెస్ అవ్వ‌డానికి ద‌శాబ్దం పైన ప‌ట్టింది. గుడ‌ఛారి విజ‌యంతోనే శేషు సోలో హీరోగా ఫేమస్ అయిన సంగ‌తి తెలిసిందే.