Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కొత్త హోస్ట్ పై మళ్లీ చర్చ..!

ఇక బిగ్ బాస్ సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే సీజన్ 8 హోస్ట్ విషయంలో చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 10:30 AM GMT
బిగ్ బాస్ కొత్త హోస్ట్ పై మళ్లీ చర్చ..!
X

బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 8 మీద కూడా భారీ హైప్ ఏర్పడింది. బిగ్ బాస్ సీజన్ 8 విషయంలో బిగ్ బాస్ టీం కూడా సరికొత్త ప్లానింగ్ తో ఉన్నారట. బిగ్ బాస్ సీజన్ 7 కే హోస్ట్ గా నాగార్జున చేస్తాడా లేదా అన్న డౌట్ నడిచింది. అయితే బిగ్ బాస్ టీం ఎలాగోలా నాగార్జునని ఒప్పించి సీజన్ 7 ఉల్టా పుల్టాని సక్సెస్ చేశారు. సీజన్ 6 ఫ్లాప్ అవ్వడంతో సీజన్ 7 విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సీజన్ హిట్ అయ్యింది.

ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ అదే ఓటీటీ సెకండ్ సీజన్ ని మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ కంటెస్టెంట్స్ ఎవరు అంతగా ఆసక్తిగా లేరని అది ఆపేశారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే సీజన్ 8 హోస్ట్ విషయంలో చర్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా నాగార్జున చేసే అవకాశం లేదని టాక్.

బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చాడు. అయితే ప్రతి సీజన్ ముందు హోస్ట్ గా నాగార్జున ఉంటాడా లేదా అనే అనుమానాలు రావడం ఆ తర్వాత ఫైనల్ గా ఆయన్నే హోస్ట్ గా కొనసాగించడం జరుగుతుంది. సీజన్ 7 ముందు కూడా ఇదే స్టోరీ నడిచింది. సీజన్ 7 హిట్ అవ్వడంలో నాగార్జున హోస్ట్ కూడా ఒక రీజన్ అయ్యింది.

అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ హోస్ట్ ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చేయడం కుదరని నాగార్జున ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా చేయకూడదని అనుకుంటున్నారట. నాగార్జున కాకపోతే బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరన్నది మాత్రం ప్రశ్నార్ధంగానే ఉంది. రానా లాంటి యువ హీరోని గట్టిగానే ట్రై చేస్తున్నారని టాక్. మరోపక్క వెంకటేష్ ని కూడా హోస్ట్ గా చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం హోస్ట్ గా నాగార్జుననే పర్ఫెక్ట్ అని ఆయన్ను మార్చొద్దని అంటున్నారు. మరి హోస్ట్ విషయంలో బిగ్ బాస్ టీం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.