కొత్త ట్రెండ్.. కూలీ కూడా అదే ఫాలో అవుతుందా..
సినిమాకు అత్యధిక కలెక్షన్లు రావాలంటే నార్త్ లో ఆడడం ముఖ్యం. హిందీలో మంచి టాక్ దక్కించుకుంటే వసూళ్లు భారీగా సాధించే అవకాశాలు ఉంటాయి.
By: Tupaki Desk | 25 July 2025 11:26 AM ISTసినిమాకు అత్యధిక కలెక్షన్లు రావాలంటే నార్త్ లో ఆడడం ముఖ్యం. హిందీలో మంచి టాక్ దక్కించుకుంటే వసూళ్లు భారీగా సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే భారత్ లో దేశవ్యాప్తంగా ప్రముఖ మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఇవి నార్త్ టు సౌత్ ప్రధాన నగరాల్లో ఉన్నాయి. అయితే సౌత్ లో కంటే నార్త్ లో వీటి నిబంధనలు వేరుగా ఉన్నాయి.
ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత OTTలో రిలీజ్ అయితేనే మల్టీప్లెక్స్ లో సినిమా ప్రదర్శితం అవుతుంది. మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉత్తర భారత్ లో ఈ రూల్ తోనే సినిమాలను ప్రదర్శిస్తుంది. ఒకవేళ 8 వారాల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం ఉంటే మాత్రం, ఆ సినిమాలను జాతీయ మల్టీప్లెక్స్ చైన్స్ లో విడుదల చేయడం లేదు. ఈ రూల్ నార్త్ ఇండియాలో పక్కాగా అమలవుతుంది.
అయితే ఇక్కడే సినిమా మేకర్స్ కు మరో సమస్య వస్తుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఒప్పందం అంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసేందుకు ఆకస్తి చూపించడం లేదు. ఈ విధంగానే తమిళ సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో 8 వారాల ఒప్పందం కుదుర్చుకొని నార్త్ మల్టిపెక్స్ ల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
పలు సినిమాలకు రెస్పాన్స్ లేకపోవడంతో థియేటర్ రన్ తొందరగా ముగుస్తున్నాయి. దీంతో మేకర్స్ 8 వారాల కంటే ముందే స్ట్రీమింగ్ చేయమని అడుగుతున్నారు. ఈ క్రమంలో మల్టిప్లెక్స్ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తున్నారు. అందుకు పరిహారంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్‌కు జరిమానా కూడా కడుతున్నారు.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల చిత్రం థగ్ లైఫ్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు సుదీర్ఘ చర్చల తర్వాత, రజినీకాంత్ రాబోయే చిత్రం కూలీ మల్టీప్లెక్స్‌లలో గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాకు కూడా 8 వారాల అగ్రిమెంట్ ఉంది. అయితే కూలీ సినిమా థియేట్రికల్ రన్ త్వరగా ముగిసిపోతే, ఈ మూవీ కూడా 8 వారాల కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వెళుతుంది. దీంతో నిర్మాతలు మల్టిప్లెక్స్ అసోసియేషన్ కు కోట్ చేసిన జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నార్త్ ఇండియాలో తమిళ సినిమాలకు ఇది కొత్త ట్రెండ్‌గా మారింది.
