Begin typing your search above and press return to search.

ఉపాస‌న కొణిదెల నిక‌ర ఆస్తి విలువ‌?

రామ్ చరణ్ - ఉపాసన జంట ప్రేమ‌వివాహం గురించి తెలిసిందే. చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ జంట‌ సంయుక్తంగా 2,500 కోట్ల రూపాయల నికర ఆస్తుల‌ను క‌లిగి ఉన్నార‌ని ఒక అంచ‌నా.

By:  Tupaki Desk   |   27 May 2024 3:30 PM GMT
ఉపాస‌న కొణిదెల నిక‌ర ఆస్తి విలువ‌?
X

సౌతిండియా సూప‌ర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్న రామ్‌ చరణ్ RRR, మగధీర, రంగస్థలం, ధృవ‌ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల‌తో గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. త‌న‌దైన అద్భుత న‌ట‌ప్ర‌తిభ‌తో ఒక్కో మెట్టు ఎక్కారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీని స్థాపించి నిర్మాత‌గాను సినిమాలు తీస్తున్నారు. భార‌త‌ దేశంలోని అత్యంత సంపన్న హీరోల‌లో ఒకరిగా చ‌ర‌ణ్ పేరు రికార్డుల్లో ఉంది. అయితే అత‌డు అతిపెద్ద సంస్థానాలు క‌లిగి ఉన్న‌ కామినేని ఇంటి అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ జీవిత‌ భాగస్వామి ఉపాసన కామినేని ఆస్తి ఐశ్వ‌ర్యం గురించి త‌ర‌చుగా అభిమానుల్లో చ‌ర్చ సాగుతుంటుంది.

ఉపాసన కామినేని కేవలం చ‌ర‌ణ్‌కి భార్య మాత్రమే కాదు.. సువిశాల‌మైన అపోలో గ్రూప్స్ సామ్రాజ్యంలో కీల‌క బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్న మేటి ఎంట‌ర్‌ప్రెన్యూర్. అపోలో గ్రూప్స్ ట‌ర్నోవ‌ర్ నేడు 77,000 కోట్లు పైబడి ఉంది. ఇంత‌టి విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసుల్లో ఆమె ఒక‌రు. కామినేని వంశం హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డితో అనుబంధం క‌లిగి ఉంది. ఉపాస‌న‌ తల్లి శోభనా కామినేని గ్రూప్ నాయ‌కుల్లో ఒక‌రు. ఉపాసన వివిధ విభాగాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన కుటుంబ సంబంధాలకు అతీతంగా, ఉపాసన కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ CSR విభాగంలో వైస్ చైర్మన్, FHPL మేనేజింగ్ డైరెక్టర్ .. UR.Life, సంపూర్ణ వెల్నెస్ ప్లాట్‌ఫారమ్ వెనుక ఉన్న దూరదృష్టి ఉపాస‌న‌. KEI గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడైన‌ త‌న‌ తండ్రి ప్రభావం ఉపాస‌న‌ వ్యవస్థాపక స్ఫూర్తిని మరింత మెరుగుపరుస్తుంది.

రామ్ చరణ్ - ఉపాసన జంట ప్రేమ‌వివాహం గురించి తెలిసిందే. చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ జంట‌ సంయుక్తంగా 2,500 కోట్ల రూపాయల నికర ఆస్తుల‌ను క‌లిగి ఉన్నార‌ని ఒక అంచ‌నా. మెగా న‌ట‌వార‌సుడైన‌ రామ్ చరణ్ నిక‌ర ఆస్తుల విలువ‌ రూ. 1,370 కోట్లు కాగా, ఉపాసన సంపద సుమారు రూ. 1,130 కోట్లుగా ఉంద‌ని అంచ‌నా. ఈ రెండిటినీ క‌లిపితే సుమారు 2500 కోట్ల ఆస్తిప‌రులు. దేశంలోని సంపన్న సెల‌బ్రిటీ క‌పుల్స్ లో వారి పేరు నిలిచి ఉంది.

ఉపాసన కామినేని విద్యార్హ‌తలు స‌మున్న‌త‌మైన‌వి. రీజెంట్స్ యూనివర్శిటీ లండన్ నుండి MBA .. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ప్ర‌శంసాపూర్వ‌కమైన‌ డిగ్రీని క‌లిగి ఉన్నారు.

విలాసవంతమైన జీవనశైలి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక విశాలమైన భవనంలో నివసిస్తున్న ఈ జంట సంపన్నమైన జీవనశైలి వారి విజయానికి ప్రతీక. రూ.30 కోట్ల విలువ చేసే నివాసం వారి సామాజిక ఔన్నత్యానికి నిదర్శనం. అదనంగా ఒక ప్రైవేట్ జెట్ .. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ మేబ్యాక్, ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ సహా హై-ఎండ్ కార్లు వీరి సొంతం. ఉన్నారు.

రామ్ చరణ్ -ఉపాసన కామినేని ప్రయాణాల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌తిభ, వ్యాపార చతురత, ఐశ్వర్యాల క‌ల‌యిక‌గా వారిని చూడవచ్చు. వినోదం, కార్పొరేట్ రంగాలలో తిరుగులేని శ‌క్తులుగా ఎదిగారు.