Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ ను పండగ రోజే తగులుకున్నారే..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పటి వరకు నాలుగు సినిమాలే తీసిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   26 March 2024 5:01 AM GMT
ప్రశాంత్ నీల్ ను పండగ రోజే తగులుకున్నారే..
X

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పటి వరకు నాలుగు సినిమాలే తీసిన విషయం తెలిసిందే. కానీ ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు. నాలుగు చిత్రాలు తీయడానికి ఆయనకు పదేళ్ల సమయం పట్టింది. ఉగ్రం మూవీతో దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్.. రెండో చిత్రమే పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు. 2018లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను ఒక్కసారిగా ఒక ఊపు ఊపేసింది.

ఇక ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్‍ 2.. ఫస్ట్ పార్ట్ కు మించి సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇటీవల సలార్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా తీయనున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్.. సీక్వెల్ స్క్రిప్ట్ ను లాక్ చేశారు.

ఇదంతా పక్కన పెడితే.. నిన్న (మార్చి 25) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. రంగుల్లో మునిగితేలారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియాలను కూడా షేర్ చేశారు. తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇదే టైమ్ లో సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ పై ఫన్నీ ట్రోల్స్ కనిపించాయి.

అయితే ఉగ్రం నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటోంది. దీంతో ఫ్యాన్స్ అన్నా మీరెప్పుడు కలర్స్ వాడరా అంటూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ విషయం పైనే ఫన్నీ ట్రోల్స్ చేశారు కొందరు నెటిజన్లు. ప్రశాంత్ నీల్ కు బ్లాక్ అండ్ వైట్ ఇష్టం కదా, కాబట్టి హోలీ సెలబ్రేషన్స్ లో మిగతా కలర్స్ వాడకపోయి ఉంటారని ట్రోలింగ్ చేశారు. ఇవి ఫన్నీ ట్రోల్స్ అయినా.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే కొన్ని రోజుల క్రితం.. తన సినిమాల్లో కలర్స్ ఎందుకు వాడనో కూడా క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. తనకు ఓసీడీ ఉందని, దీంతో ఎక్కువ కలర్స్ చూడాలంటే కన్ఫ్యూజ్ అవుతానని చెప్పారు. అందుకే తాను తీసే సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇక నీల్.. త్వరలోనే కొత్త సినిమాను పట్టాలెక్కించనున్నారు. అయితే అది సలార్-2 లేక ఎన్టీఆర్ 31 అనేది తెలియాల్సి ఉంది.