Begin typing your search above and press return to search.

గన్స్ అండ్ గులాబ్స్… రాజ్ అండ్ డీకే నుంచి మరో థ్రిల్లింగ్ సిరీస్

బాలీవుడ్ లో దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ ఫోకస్ చేశారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:21 AM GMT
గన్స్ అండ్ గులాబ్స్… రాజ్ అండ్ డీకే నుంచి మరో థ్రిల్లింగ్ సిరీస్
X

బాలీవుడ్ లో దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. వారు చేసిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. దీని తర్వాత నీ ఫ్యామిలీ మెన్ 2 కూడా చేయగా అది బ్లాక్ బస్టర్ అయింది. సమంత దీంట్లో ప్రతినాయక పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆమె మాట్లాడిన కూడా శిక్షణ తీసుకోవడం విశేషం.

విధిలా ఉంటే ఇప్పుడు సమంతతో సిటాడెల్ వెబ్ సిరీస్ ని రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తుంన్నారు. ఇది మేగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సన్నగా గన్స్ అండ్ గులాబ్స్ టైటిల్ తో మరో వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లెక్స్ లో ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 18న రిలీజ్ కాబోతూ ఉంది. దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా ఫ్రాక్షకుల ముందుకు వచ్చింది.

సతీష్ కౌశిక్, దుల్కర్ సల్మాన్, రాజ్‌కుమార్ రావు, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్ లో నటించారు. వీరు నలుగురు నాలుగు డిఫరెంట్ బ్యాగ్రౌండ్ లలో చూపించారు. అయితే వీరి చుట్టూ ఒక మాఫియా కథని ట్రైలర్ లో ప్రెజెంట్ చేశారు. 90ల నాటి బ్యాక్ డ్రాప్ లో వెబ్ సిరీస్ ఉండటం విశేషం. మొత్తం ప్రెజెంటేషన్ అంతా కూడా అలాగే చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ లో వచ్చిన 90వ దశకం గ్యాంగ్ స్టార్ అయిన సోలె ఇన్స్పిరేషన్ కూడా గన్స్ అండ్ గులాబ్స్ మీద ఉందని చెప్పొచ్చు.

పూజా గోర్, విపిన్ శర్మ, శ్రేయ ధన్వంతరి హీరోలుగా పెయిర్ గా నటించారు. ఓ వైపు లవ్ స్టోరీని చూపిస్తూ, మరోవైపు గులాబ్‌గంజ్ పట్టణంలో డ్రగ్స్ బిజినెస్ నడుపుతున్న మాఫియాకి సంబందించిన ఎలివేషన్స్ ట్రైలర్ లో చూపించారు. వినోదంతో పాటు క్రైమ్ కూడా కథలో భాగంగా ఉంటుందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ తరహా వెబ్ సిరీస్ ఇప్పటి వరకు ఓటీటీలో రాలేదని చెప్పాలి. అలాగే టాలెంటెడ్ స్టార్స్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. దీంతో కచ్చితంగా వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ వచ్చే ఛాన్స్ ఉంది. మరి వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న రాజ్ అండ్ డీకేకి గన్స్ అండ్ గులాబ్స్ ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.