Begin typing your search above and press return to search.

OTT: నెట్ ఫ్లిక్స్ Vs ప్రైమ్ వీడియో

డిజిటల్ యుగంలో ఓటీటీల మార్కెట్ బాగా విస్తరించింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రతి ఇంట్లో ఓటీటీ ప్లాట్‌ఫాంల వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   25 April 2024 10:30 AM GMT
OTT: నెట్ ఫ్లిక్స్ Vs ప్రైమ్ వీడియో
X

డిజిటల్ యుగంలో ఓటీటీల మార్కెట్ బాగా విస్తరించింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రతి ఇంట్లో ఓటీటీ ప్లాట్‌ఫాంల వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ప్రముఖ ఓటీటీల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీక్షకులను ఆకట్టుకోడానికి ఎప్పటికప్పుడు సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొస్తున్నారు. ఫ్రెష్ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తూ, వ్యూయర్ షిప్ పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.

సినీ ప్రియుల కోసం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా, సన్ నెక్స్ట్, జియో సినిమా, ఈటీవీ విన్.. లాంటి ఎన్నో ఓటీటీ వేదికలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నా ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ - ప్రైమ్ వీడియోల మధ్యనే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త కంటెంట్ ను అప్లోడ్ చేయడం విషయంలోనే కాదు, అప్ కమింగ్ సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేయడంలోనూ పోటీ పడుతున్నారు.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు పోటాపోటీగా తమ ఓటీటీలలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీసులు, సరికొత్త షోలను ప్రకటించాయి. వాటిల్లో ప్రస్తుతం సెట్స్ మీదున్న పలు క్రేజీ తెలుగు చిత్రాలు, త్వరలో రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. రెండు దిగ్గజ ఓటీటీలు ఫ్యాన్సీ రేట్లకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న కంటెంట్ విషయానికొస్తే.. ముందుగా ఇటీవల బాక్సాఫీస్ వద్ద 125 కోట్లు వసూలు చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచిన సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' సినిమా రాబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాన్ని ఈ ఓటీటీనే సొంతం చేసుకుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మే 17న ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత నాలుగైదు వారాలకు డిజిటల్ వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప: ది రూల్' సినిమాని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న 'దేవర 1' చిత్రాన్ని కూడా కొనుగోలు చేసింది. అలానే నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న NBK 109.. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలిసి చేస్తున్న VD 12 సినిమాల స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్నారు. అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో రాబోతున్న 'తండేల్' మూవీతో పాటుగా కమల్ హాసన్ చేస్తున్న 'భారతీయుడు 2' రైట్స్ ను కూడా మంచి రేటుకు కొనుగోలు చేశారు.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికొస్తే, రేపటి నుంచి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీని స్ట్రీమింగ్ పెడుతోంది. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' సినిమా హక్కులను దక్కించుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీరమల్లు' చిత్రాలు రెండూ ప్రైమ్ వద్దనే ఉన్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న 'తమ్ముడు'.. క్రిష్ తో అనుష్క చేస్తున్న 'ఘాటీ' సినిమాలను తీసుకున్నారు. అలానే సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'.. కాంతారా ప్రీక్వెల్ గా రూపొందుతున్న 'కాంతారా చాప్టర్-1' చిత్రాలను కూడా అమెజాన్ సంస్థే సొంతం చేసుకుంది.