Begin typing your search above and press return to search.

యువ హీరోతో భూమీ ప‌డ్నేక‌ర్ ర‌సిక‌రాజ్యం!

అప్ప‌టి రాచ‌రికాన్ని-విలాస వంత‌మైన జీవితాన్నిఈ కాలంలో కొనసాగించి అప్పులు పాల‌య్యే ఓ రాజ కుటుంబ క‌థే దిరాయ‌ల్స్ సిరీస్.

By:  Tupaki Desk   |   8 May 2025 12:44 PM
యువ హీరోతో భూమీ ప‌డ్నేక‌ర్ ర‌సిక‌రాజ్యం!
X

నెట్ ప్లిక్స్ మ‌రో రొమాంటిక్ వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. `ది రాయ‌ల్స్ `టైటిల్ తో తెరకెక్కుతోన్న సిరీస్ లో భూమీప‌డ్నేక‌ర్-ఇషాన్ క‌ట్ట‌ర్- జీన‌మ్ ఆమ‌న్-నోరా ప‌టేహీ స‌హా ప‌లువురు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో కంటెంట్ ఎలా ఉంటుంద‌న్న‌ది అర్ద‌మవుతుంది. ఇదొక మోర్పురు రాయ‌ల్ కుటుంబం చుట్టూ తిరిగే క‌థ‌. అప్ప‌టి రాచ‌రికాన్ని-విలాస వంత‌మైన జీవితాన్నిఈ కాలంలో కొనసాగించి అప్పులు పాల‌య్యే ఓ రాజ కుటుంబ క‌థే దిరాయ‌ల్స్ సిరీస్.

మోర్పూరు సామ్ర‌జ్య వార‌సుడిగా ఇషాన్ క‌ట్ట‌ర్ -జీవితంలో ఎద‌గాల‌నే అమ్మాయిగా భూమీ ప‌డ్నే క‌ర్ పాత్ర‌లు ట్రైల‌ర్ లో ఇంట్రెస్టింగ్ మ‌లిచారు. కుప్ప‌కూలిపోతున్న సామ్రాజ్యాన్ని భూమీ నిల‌బెట్టే ప్ర‌య‌త్నం ఎలా చేసింది? అవిరాజ్- సోఫియా పాత్ర‌ల నేప‌థ్యం ఆస‌క్తికరంగా ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదంతా ప‌క్క‌న బెడితే ఇషాన్ క‌ట్ట‌ర్-భూమీ ప‌డ్నేక‌ర్ మ‌ధ్య రొమాంటిక్ ఇంటిమేట్ స‌న్నివేశాలు సిరీస్ ని ఊపేసేలా క‌నిపిస్తున్నాయి.

ఇద్ద‌రి మ‌ధ్య న్యూడ్ స‌న్ని వేశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఇంటిమేట్ స‌న్నివేశాల్లో భూమీ ప‌డ్నేక‌ర్ ఏ రేంజ్ పెర్పార్మెన్స్ ఇస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌స్ట్ సిరీస్ లోనే తానేంటో ప్రూవ్ చేసింది. ఈ నేప‌థ్యంలో ది రాయ‌ల్స్ పై ఆస‌క్తి అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఇంటిమేట్ స‌న్నివేశాల కోసం ఇషాన్ క‌ట్ట‌ర్-భూమీ ప‌డ్నేక‌ర్ కొన్ని వ‌ర్క్ షాప్స్ లో కూడా పాల్గొన్నారు. ఒక‌రిని ఒక‌రు అర్దం చేసుకోవ‌డానికి ఈ వ‌ర్క్ షాపులు ఎంత‌గానో స‌హ‌క‌రించిన‌ట్లు భూమీ తెలిపింది.

ఇదే స‌మ‌యంలో కొన్ని సెంటిమెంట్లు కూడా ఈ సిరీస్ ను గ‌ట్టెక్కిస్తాయా? అన్న ఆందోళ‌నా వెంటాడు తుంది. సోనమ్ కపూర్ - ఖూబ్‌సూరత్ న‌టించిన క్లాసిక్ రిచ్-మీట్స్-మిడిల్ క్లాస్ లవ్ స్టోరీలను ట్రైల‌ర్ గుర్తు చేస్తుంది. మరో టీవీ సిరీస్ `కుల్: ది లెగసీ ఆఫ్ ది రైజింగ్‌గ్స్` వంటి వాటిని గుర్తు చేస్తుంది. ఈ రెండు సిరీస్ లు అప్ప‌ట్లో పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. ఈనేప‌థ్యంలో `ది రాయ‌ల్స్` ఎలాంటి రిజ‌ల్ట్ సాధిస్తుంది? అన్న దానిపై స‌స్పెన్స్ గా మారింది.