Begin typing your search above and press return to search.

డాక్యుమెంట‌రీకి అత‌డు అర్హుడేనా?

టాలీవుడ్ లో తండ్రీ-కొడుకులిద్ద‌రు పెద్ద స్టార్లు. తండ్రిని మించిన త‌న‌యుడు గ్లోబ‌ల్ స్థాయిలో ఇమేజ్ సంపాదించాడు. ఇండియాలోనే త‌న‌కంటూ ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 May 2025 7:00 AM IST
డాక్యుమెంట‌రీకి అత‌డు అర్హుడేనా?
X

టాలీవుడ్ లో తండ్రీ-కొడుకులిద్ద‌రు పెద్ద స్టార్లు. తండ్రిని మించిన త‌న‌యుడు గ్లోబ‌ల్ స్థాయిలో ఇమేజ్ సంపాదించాడు. ఇండియాలోనే త‌న‌కంటూ ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. అత‌డి సినిమాల కంటూ ప్ర‌త్యేక‌మైన డిమాండ్ ఉంది. తాను అంత పెద్ద స్టార్ అయ్యాడంటే కార‌ణం డాడ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి కార‌ణంగా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలొచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకోవ‌డంలో నూరు శాతం స‌క్సస్ అయ్యాడు.

అందుకోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు . అందులో ఎలాంటి డౌట్ లేదు. తండ్రి స్టార్ అనే ట్యాగ్ మాత్ర‌మే అత‌డి ని స్టార్ ని చేయ‌లేదు అభిమానులు. తండ్రి బ్యాకప్...వ‌చ్చిన అవ‌కాశాలు వినియోగించుకోవ‌డంతోనే సాధ్యమైంది. అయితే ఇప్పుడా వార‌సుడి పై నెట్ ప్లిక్స్ ఓ డాక్యుమెంట‌రీ రూపంలో తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. పాన్ ఇండియాలో అత‌డికి ఉన్న ఇమేజ్ ని బేస్ చేసుకుని ఈ ర‌క‌మైన నెట్ ప్లిక్స్ ఈ ర‌క‌మైన ఆలోచ‌న చేసి ఉండొచ్చు.

అయితే అత‌డి క‌థ‌లో బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసిన గొప్ప ఎమోష‌న్ అంటూ ఏదీ లేదు. ఎందుకంటే చిన్న‌ప్ప‌టి నుంచి గోల్డెన్ స్పూన్. తాను పుట్టేస‌రికే తండ్రి పెద్ద స్టార్. డ‌బ్బుకు క‌రువు లేదు. పెద్ద పెద్ద స్కూల్స్ లో చ‌దువు. అయినా గొప్ప‌గా చ‌దివింది కూడా లేదు. చ‌దువుల్లో వీకే. తెలివైన విద్యార్ధి ఏం కాదు. న‌టుడిగా ఎంట్రీ ఎంతో సుల‌భంగా జ‌రిగిపోయింది. ఇండ‌స్ట్రీలో కాళ్ల‌రిగేలా క‌ష్ట‌ప‌డి అవ‌కాశాలేమి సంపాదించ‌లేదు.

అది డాడ్ ఇమేజ్ కార‌ణంగా సాధ్య‌మైంది. న‌టుడిగా ఎదిగే క్ర‌మంలో మాత్ర‌మే క‌ష్ట‌ప‌డ్డాడు. అదీ ఫిజిక‌ల్ గానే. ఆయ‌న క‌థ‌లో ఎక్క‌డా ఎమోష‌న్ కనిపించ‌లేదు. ఎమోష‌న్ అన్న‌ది కేవ‌లం క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారిది మాత్ర‌మే హైలైట్ అవుతుంది. ఆర‌కంగా చూసుకుంటే డాక్యుమెంట‌రీకి అస‌లు అర్హుడే కాదు. అత‌డి స్థానంలో అత‌డి తండ్రికి క‌థ‌ని తెర‌కెక్కిస్తే అద్భుత‌మ‌వుతుంది. అత‌ని జీవితంలో ఎంతో ఎమోష‌న్ ఉంది. దాంతో కూడిన ఎంతో క‌ష్ట ఉంది. అత‌డి ఎదిగిన తీరు గుర్తించి ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు...డాక్ట‌రేట్లు అందుకున్నారు. అన్ని ర‌కాలుగా డాక్యుమెంట‌రీకి అర్హుడు. మ‌రి నెట్ ప్లిక్స్ ఇప్ప‌టికైనా పున‌రాలిచిస్తుందేమో చూడాలి.