ఎంటర్టైన్మెంట్ కా బాప్ నెట్ ఫ్లిక్స్.. సినిమాలే సినిమాలు
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలుగు హిట్ సినిమాల హక్కులు దక్కించుకొని ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది.
By: Tupaki Desk | 20 July 2025 5:00 AM ISTఏ సినిమానైనా థియేట్రికల్ రన్ పూర్తియ్యాక, ఓటీటీ బాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలుగు హిట్ సినిమాల హక్కులు దక్కించుకొని ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ దాదాపు డాకు మహారాజ్, తండేల్, కోర్ట్, హిట్- 3, మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించింది. ఇక 2025 సెకండ్ హాఫ్ లోనూ భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి. మరి ఈ సినిమాలు ఏంటో చూసేద్దాం!
ఓజీ : పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. నవంబర్ లో ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
కింగ్ డమ్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్ డమ్. ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఆయన డాకు మహారాజ్, లక్కీ భాస్కర్ సినిమాల విజయాల జోరుతో నాగవంశీ ఈ సినిమాతోనూ హిట్ ట్రాక్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలను గతంలో ఆయన లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ కే అమ్మారు. తాజాగా ఈ సినిమాను కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. జూలై 31న విడుదల కానున్న ఈ సినిమా, సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
మాస్ జాతర : మాస్ మహారాజ రవితేజ మాస్ జాతర సినిమాతో రానున్నారు. రవితేజ ఇందులో పోలీసుగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. అక్టోబర్ లో ఇది ఓటీటీలో కి వచ్చే ఛాన్స్ ఉంది.
ఆంధ్ర కింగ్ తాలూకా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ కు ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ అవసరం. ఈ సినిమా కంప్లీట్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. మహేష్ పి దర్శకుడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించ లేదు. కానీ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ హక్కులు మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాలతోపాటు బాలకృష్ణ అఖండ 2, ప్రభాస్ రాజా సాబ్ సినిమాల హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
