Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల రోడ్ షోలో నేహా శర్మ హ‌ల్ చ‌ల్

చిరుత బ్యూటీ నేహాశ‌ర్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంద‌ని ఇంత‌కుముందు త‌న తండ్రి, రాజ‌కీయ నాయ‌కుడు అయిన అజిత్ శ‌ర్మ ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   26 April 2024 5:38 AM GMT
ఎన్నిక‌ల రోడ్ షోలో నేహా శర్మ హ‌ల్ చ‌ల్
X

చిరుత బ్యూటీ నేహాశ‌ర్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంద‌ని ఇంత‌కుముందు త‌న తండ్రి, రాజ‌కీయ నాయ‌కుడు అయిన అజిత్ శ‌ర్మ ప్ర‌క‌టించారు. బీహార్ భాగ‌ల్ పూర్ లో అత‌డు పాపులర్ నాయ‌కుడు. ఇప్పుడు నేహా శర్మ భాగల్‌పూర్‌లో తండ్రికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించ‌గా ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. మార్గం ఆద్యంతం జ‌నంతో కిక్కిరిసింది. త‌మ అభిమాన గ్లామ‌ర‌స్ స్టార్ నేహా శ‌ర్మ‌ను వీక్షించేందుకు యువ‌జ‌నం ఎగ‌బ‌డ్డారు.

బాలీవుడ్ నటి నేహా శర్మ గురువారం బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో తన తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు. భాగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ పోటీ చేస్తున్నారు. నేహా శర్మ .. త‌న‌ తండ్రి థార్‌పై ప్రయాణిస్తూ సోనావర్సా నుండి నౌగాచియా వరకు ప్రచారం చేశారు. తనని, తన తండ్రిని చూసేందుకు రోడ్డుపక్కన నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ శ‌ర్మా గాల్ చేతులు ఊపుతూ క‌నిపించింది. ఈ రోడ్ షోలో శ‌ర్మాజీ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగానే సింపుల్ గా ట్రెడిష‌న‌ల్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అందంగా క‌నిపించారు.

కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), వామపక్ష పార్టీలతో కూడిన మహాఘటబంధన్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు శ‌ర్మా గాళ్ తో రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం అజిత్ శర్మ భాగల్పూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీహార్‌లోని ఐదు స్థానాల్లో భాగల్‌పూర్, బంకా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా స‌హా లోక్‌సభ ఎన్నికల రెండో దశ శుక్రవారం జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

నేహా శ‌ర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి ప్ర‌య‌త్న‌మే చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించింది. కానీ ఇటీవ‌ల కెరీర్ ఆశించినంత‌గా వెల‌గ‌లేదు. నేహా శ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్మా గాళ్స్ యూట్యూబ్ షోలు అంత‌ర్జాలంలో పాపుల‌ర్ అయ్యాయి.