Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ లోనే హీటేక్కిస్తున్న నేహా

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా శర్మ రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:30 PM GMT
ట్రెడిషనల్ లోనే హీటేక్కిస్తున్న నేహా
X

చిరుత సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మని అంత వేగంగా ఎవరూ కూడా మరిచిపోరు. ఈ బిహారీ భామ మొదటి చిత్రంతోనే తన గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఆపై నటనతో కూడా మెప్పించింది. మొదటి చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గామారిపోతుందని ఎక్స్ పెక్ట్ చేసిన మళ్ళీ ఎందుకనో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.


వరుణ్ సందేశ్ కి జోడీగా కుర్రాడు మూవీలో నేహా శర్మ నటించింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ హీరోయిన్ గా అవకాశాలు భాగానే వచ్చాయి. అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపుని మాత్రం నేహా శర్మ సొంతం చేసుకోలేక పోయింది. అయితే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా శర్మ రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్, వ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ హాట్ ఫోటోల కారణంగా నేహా శర్మని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారికి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్ స్టాలో 19.9 మిలియన్ ఫాలోవర్స్ నేహా శర్మకి ఉన్నారు.

అందుకే ఆమె షేర్ చేసే ఫొటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ట్రెడిషనల్ స్టైల్ లో హాట్ ఫొటోస్ ని నేహా శర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇండియన్ స్టైల్ ట్రెడిషనల్ షూట్ త్రయంబకంలోని గౌరీ నారాయణ స్వామి టెంపుల్ లో నవరాత్రి వేడుకలలో భాగంగా పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నట్లు ఫొటోలకి క్యాప్షన్ కూడా ఇచ్చింది.


ఈ ఫోటోలని 2.91 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఇందులో పింక్ కలర్ బ్లౌజ్ లో ఎద అందాలని వయ్యారంగా చూపిస్తూ నేహా శర్మ కుర్రాళ్ళ మనసులకి గాలం వేస్తోంది. చూపులతో వలపుల మందారాలు విసురుతూ కవ్విస్తోంది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.