Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్యాక్ అందాలతో సింగర్‌ కవ్వింపులు

భాసిన్‌ 200 లో ఛానల్ 'వి' పాప్‌ స్టార్‌ కోసం ఆడిషన్స్ నిర్వహించిన సమయంలో భాసిన్ వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   7 May 2024 3:30 PM GMT
పిక్ టాక్ : బ్యాక్ అందాలతో సింగర్‌ కవ్వింపులు
X

హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో పాటలు పాడటంతో పాటు పాప్‌ మరియు పంజాబీ జానపద సంగీతంలో ప్రావిణ్యం సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ నేహా భాసిన్‌ నాలుగు పదుల వయసు దాటినా కూడా అందాల ఆరబోత విషయంలో హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తుంది.


వివిధ భాషల్లో పాటలు పాడి ఏకంగా ఏడు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్న భాసిన్‌ ప్లే బ్యాక్ సింగర్‌ గా దేశంలోనే అత్యున్నత సింగర్ గా పేరు దక్కించుకుంది. భాసిన్‌ 200 లో ఛానల్ 'వి' పాప్‌ స్టార్‌ కోసం ఆడిషన్స్ నిర్వహించిన సమయంలో భాసిన్ వెలుగులోకి వచ్చింది.


ఎన్నో స్టేజ్‌ షో లు చేసిన భాసిన్‌ 2007 నుంచి వరుసగా హిందీ సినిమాలకు పాటలు పాడే అవకాశం దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో భాసిన్‌ షేర్ చేసే ఫోటోలు మరియు వీడియో లు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలతో చూపరుల దృష్టిని ఆకర్షించింది.

సింగర్ గా స్టార్‌డం దక్కించుకున్న వారు చాలా మంది ఇలా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయరు. భాసిన్‌ మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకునేందుకు ఇలాంటి అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలా బ్యాక్‌ అందంతో కన్నుల విందు చేసింది.

తన బ్యాక్ అందంతో భాసిన్‌ కుర్రకారును కవ్విస్తోంది. ఇంతటి అందగత్తెకు ఎందుకు వెండి తెరపై ఎక్కువ గుర్తింపు రాలేదు అంటూ కొందరు ఈతరం ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైతేనేం నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా భాసిన్ అందాల ఆరబోతతో కుమ్మేస్తోంది.