Begin typing your search above and press return to search.

డీజే పాప హై గ్లామర్ డోస్.. ఎన్నాళ్లయ్యిందో..

తెలుగు సినిమా ‘డీజే టిల్లు యూత్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి, ఇప్పుడు గ్లామర్ షోతో మరింతగా ఫోకస్‌లోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 12:00 AM IST
డీజే పాప హై గ్లామర్ డోస్.. ఎన్నాళ్లయ్యిందో..
X

తెలుగు సినిమా ‘డీజే టిల్లు యూత్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి, ఇప్పుడు గ్లామర్ షోతో మరింతగా ఫోకస్‌లోకి వస్తోంది. బీచ్‌ల్లో, లైట్ లైట్ ఎఫెక్ట్‌లతో కాస్త గ్లామరస్ గా కనిపించే ఆమె లేటెస్ట్ ఫొటోషూట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లైట్ బ్లూ హై స్లిట్ గౌన్‌లో ఆమె వేసిన స్టైలిష్ పోజులు చూసిన నెటిజన్లు ఆమె క్యాప్షన్‌కే ఫిదా అయిపోతున్నారు.


ఈ ఫొటోల్లో నీలం రంగు డ్రస్సులో నేహా తన అందాన్ని మరింతగా హైలైట్ చేస్తూ, సూర్యాస్తమయం, లైటింగ్‌తో పర్ఫెక్ట్ అంబియెన్స్‌కి తగ్గట్లుగా స్టైలిష్ ఫోజులు ఇచ్చింది. తన డ్రెస్‌లో ఉన్న స్లిట్ డిజైన్, సైడ్ కట్ డీటెయిల్స్, భారీ గులాబీ డిజైన్ హైలెట్ అయ్యాయి. దీంతో ఆమె స్టన్నింగ్ ఫొటోలు ఇప్పటికే లక్షల్లో లైక్స్ కొల్లగొట్టాయి.


అభిమానులకే కాదు, సినీ పరిశ్రమలో కూడా ఈ ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే కొన్ని హిందీ, కన్నడ ప్రాజెక్టుల్లో నటించిన నేహా.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో మరోసారి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి మాస్‌గానే ఆకట్టుకుంది. గ్లామర్‌తో పాటు పాత్రలోనూ పర్ఫార్మెన్స్ ఉండే సినిమాలు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తోంది.


ఫ్యాషన్ ఫోటోషూట్స్, మోడరన్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నేహా.. సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. కొత్తదనం కోసం ప్రయత్నించే ఫొటోషూట్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ చూసి చాలా మంది యాక్ట్రస్‌లు స్ఫూర్తి పొందుతున్నారనడంలో సందేహం లేదు.


ఇక ఈ లేటెస్ట్ హాట్ ఫొటోషూట్ చూసిన తర్వాత నెటిజన్లలో “బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది” అనే టాక్ వినిపిస్తోంది. ఆమెను ఇలా చూసి ఎన్నాళ్లయ్యిందో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి గ్లామర్‌తో పాటు నటనలోనూ టాలెంట్ చూపిస్తున్న నేహా.. తనదైన స్టైల్‌తో టాలీవుడ్‌లో ఓ గులాబీ అందం అనే ఇమేజ్‌ను బలపరుస్తోంది. ఇక ఆమె భవిష్యత్తులో ఎలాంటి అవకాశం అందుకుంటుందో చూడాలి.