Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్ లో క్యూట్ శెట్టి.. స్టన్నింగ్

టాలీవుడ్ లో 'రాధిక' అనగానే యూత్ కు వెంటనే గుర్తొచ్చే పేరు నేహా శెట్టి. డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో కుర్రకారు గుండెల్లో గట్టిగా ముద్ర వేసిన ఈ క్యూట్ బ్యూటీ, అప్పటినుంచి సోషల్ మీడియాలో తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకుంటోంది.

By:  M Prashanth   |   17 Oct 2026 10:34 PM IST
మినీ స్కర్ట్ లో క్యూట్ శెట్టి.. స్టన్నింగ్
X

టాలీవుడ్ లో 'రాధిక' అనగానే యూత్ కు వెంటనే గుర్తొచ్చే పేరు నేహా శెట్టి. డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో కుర్రకారు గుండెల్లో గట్టిగా ముద్ర వేసిన ఈ క్యూట్ బ్యూటీ, అప్పటినుంచి సోషల్ మీడియాలో తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకుంటోంది. వరుస సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై ఎంత బిజీగా సందడి చేస్తున్నప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ లో తనదైన గ్లామరస్ ఫోటోషూట్లతో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండటం ఆమెకు అలవాటే.




లేటెస్ట్ గా ఈ భామ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో, ఫ్లోరల్ ఆఫ్ షోల్డర్ క్రాప్ టాప్, డెనిమ్ మినీ స్కర్ట్ ధరించి అదిరిపోయే ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. కాట్ బీయింగ్ క్యూట్ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్ నెటిజన్లను గట్టిగానే ఆకట్టుకుంటున్నాయి. అందులో ఆమె ఇచ్చిన స్మైల్, ఆ స్టైలిష్ లుక్ కు సోషల్ మీడియాలో లైకుల వర్షం కురుస్తోంది.




ఈ ఫొటోల్లో నేహా శెట్టి గ్లామర్, క్యూట్ నెస్ రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిందనే చెప్పాలి. మరీ ఓవర్ గా గా లేకుండా తనదైన స్టైల్ తో క్యూట్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడం ఆమె స్పెషాలిటీ. ట్రెండీ అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా సింపుల్ మేకప్, లూజ్ హెయిర్ తో నేటి యువతను కట్టిపడేస్తోంది. మోడ్రన్ డ్రెస్సుల్లో తన ఫిజిక్ ను ఎలివేట్ చేస్తూ, చూసేవాళ్లకు ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.




సినిమాల పరంగా చూసుకుంటే.. డీజే టిల్లు తర్వాత నేహా శెట్టికి టాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి. బెదురులంక, రూల్స్ రంజన్ లాంటి ప్రాజెక్టులతో తన మార్క్ చూపించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం టాలీవుడ్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. షూటింగ్ గ్యాప్ లో దొరికిన టైమ్ ను వృధా చేయకుండా, ఇలాంటి క్యూట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ తన బ్రాండ్ ఇమేజ్ ను అమాంతం పెంచుకునే పనిలో పడింది.

నేటితరం హీరోయిన్లకు సిల్వర్ స్క్రీన్ పై టాలెంట్ ఎంత ముఖ్యమో, సోషల్ మీడియాలో సాలిడ్ ఫాలోయింగ్ మెయింటైన్ చేయడం కూడా అంతే అవసరం. ఈ విషయంలో నేహా శెట్టి పక్కా క్లారిటీతో ఉన్నట్లు ఆమె పోస్టులు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. జెన్ జీ ఆడియన్స్ కు ఏది కనెక్ట్ అవుతుందో పసిగట్టి, దానికి తగ్గట్లుగా తన ఫ్యాషన్ సెన్స్ తో అప్డేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.